Diabetes: షుగర్ పేషెంట్స్ కాఫీ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ప్రమాదమే
Diabetes: కాఫీలో ప్రధానంగా కేఫైన్, అంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందులో కెఫైన్ మానసిక ఉత్సాహాన్ని అందిస్తుంది.

What precautions should diabetic patients take when drinking coffee?
డయాబెటిస్ (శుగర్) ఉన్నవారు ఆహరం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చక్కర అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. అవసరమైతే మానేయడం మంచిది. అయితే, చాలా మందికి ఉదయం, సాయంత్రం పూట కాఫీ తాగే అవలవాటు ఉంటుంది.అందులో షుగర్ పేషేంట్స్ కూడా ఉంటారు. మరి అలాంటి వారు కాఫీ తాగడం మంచిదేనా? తాగితే ఎలాంటి కాఫీ తాగాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కాఫీ లోని ముఖ్యమైన పదార్థాలు:
కాఫీలో ప్రధానంగా కేఫైన్, అంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందులో కెఫైన్ మానసిక ఉత్సాహాన్ని అందిస్తుంది. అలాగే అంటీఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే హానికరమైన మూలకాలను తొలగించడంలో సహాయపడతాయి.
డయాబెటిస్ ఉన్నవారిపై కాఫీ ప్రభావం:
కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను కొంత మేర తగ్గించే అవకాశం ఉంది. బ్లాక్ కాఫీ (అంటే పాలు, చక్కెర లేకుండా తీసుకునే కాఫీ) లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు కాఫీ కంటే బ్లాక్ టీ తీసుకోవడం ఉత్తమం. అయితే.. కేఫైన్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గే ప్రమాదం ఉంటుంది. అంటే ఇది శరీరం గ్లూకోజ్‌ను తగిన విధంగా ఉపయోగించకపోవచ్చు. అలాగే హృదయ స్పందన వేగంగా ఉండటం, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కాఫీ తాగితే ఈ ప్రమాదం ఇక ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1.బ్లాక్ కాఫీ ని ప్రాధాన్యం ఇవ్వండి: చక్కెర, మిల్క్, ఫ్లేవర్డ్ సిరప్స్ లేని కాఫీ తాగండి. కాఫీకి అల్లం లేదా దాల్చిన చెక్క కలిపితే షుగర్ కంట్రోల్ అవుతుంది.
2.రోజుకు పరిమిత పరిమాణం పాటించండి: 1 నుంచు 2 కప్పులు రోజుకి సరిపోతుంది. ఎక్కువగా తీసుకోవడం మానవేయండి.
3.వేళలు జాగ్రత్తగా ఎంచుకోండి: ఉదయం లేదా మద్యాహ్నం సమయంలో మాత్రమే తాగడం మంచిది. రాత్రి కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, బ్లడ్ షుగర్లో మార్పులు రావచ్చు.
4.స్వీటెనర్లు పట్ల జాగ్రత్త: కృత్రిమ స్వీటెనర్లను ఎక్కువగా వాడటం కూడా కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచే ప్రమాదం ఉంటుంది.
సంపూర్ణంగా మానాలా?
అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే కాఫీని పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలతో! బ్లడ్ షుగర్ స్థాయిని గమనిస్తూ, అవసరమైతే వైద్య సలహాతో మితంగా కాఫీని ఆస్వాదించవచ్చు.