ఈ సెప్టెంబర్ 15 నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది!

ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనావైరస్ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ మనకు అతి త్వరలోనే రాబోతోంది. ప్రారంభ డేటా ప్రకారం.. ఈ నెలలో (సెప్టెంబర్ 15)నే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనా.. కరోనా వ్యాక్సిన్లను సాధ్యమైన తొందరగా మార్కెట్లోకి తీసుకొస్తామని ఇప్పటికే డ్రగ్ తయారీదారులు నొక్కిచెబుతున్నారు.
ఇప్పుడు అది నిజం కాబోతోంది.. డ్రగ్ పరీక్షలను ట్రాక్ చేసే అనలిటిక్స్ సంస్థ Airfinity Ltd ఇదే విషయాన్ని వెల్లడించింది. రాబోయే వ్యాక్సిన్లు వైరస్ సోకకుండా నివారించగలవా? లేదా అనేదానిపై మొదటి ఫలితాలు సెప్టెంబర్ మధ్య నాటికి AstraZeneca Plc నుంచి డేటా వచ్చే అవకాశం ఉంది. ఔషధ
తయారీదారు ఈ నెలాఖరులోగా 30 మిలియన్ మోతాదులను అందిస్తామని UKకి హామీ ఇచ్చింది.
మరో 22 మంది వ్యాక్సిన్ పోటీదారుల్లో యుఎస్ మోడెర్నా ఇంక్, ఫైజర్ ఇంక్ బయోఎంటెక్ SE, యుఎస్-జర్మన్ భాగస్వామ్యంతో వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నాయి. ఈ వైరస్ వ్యాక్సిన్లకు సంబంధించి అక్టోబర్ 22న జరగబోయే కీలకమైన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్‌తో తేలిపోనుంది
ఈ సమావేశానికి ముందే వ్యాక్సిన్ల ప్రారంభ డేటాను అందుబాటులోకి రావొచ్చునని Airfinity పేర్కొంది. వ్యాక్సిన్ పోటీదారుల్లో నాలుగోదైన చైనా సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ ప్రాథమిక ఫలితాలను ముందుగానే పొందే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వాడితే కలిగే నష్టాలు, ప్రయోజనాలు ఏంటో స్పష్టత లేకుండా ఆమోదించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఐరోపా, భారతదేశం, అమెరికాలో కరోనా వ్యాప్తి ప్రభావం అధికంగా ఉండటంతో వ్యాక్సిన్ తొందరగా తీసుకురావడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాయి డ్రగ్ తయారీ సంస్థలు. ప్రారంభ దశ ట్రయల్స్‌లో టీకాలు తీసుకున్న కొన్ని వందల మందితో పోలిస్తే దీనికి పదివేల మంది పాల్గొనేవారు అవసరమని భావిస్తున్నాయి.
మరోవైపు వ్యాక్సిన్ల రాకపై రాజకీయంగా కూడా ఒత్తిడి ఎదురువుతోంది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 3 ఎన్నికల నాటికి వ్యాక్సిన్ సాధ్యమేనని, FDA ఆమోదం ప్రక్రియను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఫైజర్ అందించే వ్యాక్సిన్ అక్టోబర్ 22 నాటికి తగినంత డేటా రెడీగా ఉండొచ్చు. ఇందులో 30,000 మంది వ్యక్తుల ట్రయల్స్ కోసం వినియోగించుకోనున్నారు.
అక్టోబర్ 15 నాటికి మధ్యంతర డేటాను అమెరికా పొందితే.. మొదటి US ఔషధ తయారీదారుగా నిలుస్తుంది. కానీ, నవంబర్ 17 వరకు పూర్తి ఫలితాలు రావడం కష్టమంటున్నారు. ట్రయల్స్ నడుస్తున్న సమయంలో వ్యాప్తి రేటును బట్టి ఈ ఏడాది చివర్లో ఫలితాలను పొందొచ్చునని ఆస్ట్రాజెనెకా తెలిపింది.
2021 ప్రారంభంలో అత్యవసర వినియోగం కోసం వ్యాక్సిన్ మొదటి బ్యాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీదారు కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఇప్పటికే వందల మిలియన్ల మోతాదులను సరఫరా చేయాలని ఒప్పందాలు చేసుకున్నాయి.
ఏదైనా వ్యాక్సిన్ క్లియరెన్స్ పొందటానికి కనీసం సగం మందిలో వ్యాక్సిన్ పనితీరు ప్రభావవంతంగా ఉంటుందని చూపించాలని WHO సూచించింది. తీవ్రమైన దుష్ప్రభావాలు ఉన్నాయో లేదో గుర్తించాలని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సూచించారు.