Chennai Restaurant: రెస్టారెంటులో తినడానికి వెళ్ళిన మహిళ.. ఆహారంలో పురుగులు కదులుతూ కనపడ్డ వైనం

కరోనా వేళ పరిశుభ్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బయట ఏ ఆహారం తీసుకోవాలన్నా బాగా ఆలోచిస్తున్నాం. అయితే, కొన్ని రెస్టారెంట్లు మాత్రం కరోనా నిబంధనలే కాదు.. తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నాయి. భారీగా బిల్లులు వసూలు చేసే హోటళ్ళు, రెస్టారెంట్లలోనూ ఆహార పదార్థాలు బాగానే ఉన్నాయా? అని చెక్ చేసుకుని మరీ కస్టమర్లు తినాల్సి వస్తోంది. తాజాగా, తమిళనాడు రాజధాని చెన్నైలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ.

Chennai Restaurant: రెస్టారెంటులో తినడానికి వెళ్ళిన మహిళ.. ఆహారంలో పురుగులు కదులుతూ కనపడ్డ వైనం

Chennai Restaurant

Updated On : August 25, 2022 / 9:35 AM IST

Chennai Restaurant: కరోనా వేళ పరిశుభ్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బయట ఏ ఆహారం తీసుకోవాలన్నా బాగా ఆలోచిస్తున్నాం. అయితే, కొన్ని రెస్టారెంట్లు మాత్రం కరోనా నిబంధనలే కాదు.. తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నాయి. భారీగా బిల్లులు వసూలు చేసే హోటళ్ళు, రెస్టారెంట్లలోనూ ఆహార పదార్థాలు బాగానే ఉన్నాయా? అని చెక్ చేసుకుని మరీ కస్టమర్లు తినాల్సి వస్తోంది. తాజాగా, తమిళనాడు రాజధాని చెన్నైలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ.

రెస్టారెంటుకు వెళ్ళిన ఓ మహిళకు సిబ్బంది ఆమె కోరిన ఆహార పదార్థం ఇచ్చారు. అయితే, అందులో పురుగులు పాకుతూ కనపడ్డాయి. దీంతో ఆ మహిళ అధికారులకు ఫిర్యాదు చేసింది. రాణి అనే మహిళ చెన్నైలోని ‘నమ్మ విద్యా వసంత భవన్’ అనే రెస్టారెంటుకి వెళ్ళి చోలే-పూరీకి ఆర్డర్ ఇచ్చింది. చోలే-పూరీని ఆమెకు సిబ్బంది అందించారు.

అందులో పురుగులు పాకుతూ ఉండడం గమనించిన రాణి షాక్ అయింది. ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ రెస్టారెంటుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నెల రోజుల క్రితం కూడా చండీగఢ్ లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ఫుడ్ కోర్టులో ఒకరు ఆహారం తింటుండగా అందులో బతికి ఉన్న బల్లి కనపడింది.

Ganesh Chaturthi-2022: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల ధరలు భారీగా పెరిగిపోయిన వైనం.. ఎందుకంటే..?