Insurance Claim: బీమా క్లెయిమ్స్ తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. జెరోధా సీఈవో ఏమన్నారంటే?
ఇన్సూరెన్స్ కలిగి ఉన్నాంకదా.. అన్నింటికి క్లెయిమ్ లు ప్రాసెస్ చేయబడతాయని అనుకుంటే పొరపాటు. బీమా కంపెనీలు తరచుగా క్లెయిమ్‌లను పూర్తిగా చెల్లించవు..

Zerodha CEO Nithin Kamath
Rejection of Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్స్ తిరస్కరణతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని వివరాలు సరిగా పొందుపర్చినప్పటికీ పలు సార్లు బీమా క్లెయిమ్స్ తిరస్కరణ గురవుతుంటాయి. కొన్నిసార్లు పూర్తిగా మొత్తానికి క్లెయిమ్స్ కావు. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది.. తిరస్కరణకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జెరోధా సీఈవో నితిన్ కామత్ ట్విటర్ వేదికగా కీలక సూచనలు చేశారు. ప్రతీఒక్కరూ బీమా పాలసీని పొంది ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అయితే, పాలసీలో మినహాయింపులు, షరతులను అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. బీమా కవరేజ్, మినహాయింపులతోసహా పాలసీ గురించి పూర్తి అవగాహన లేకపోవటం వల్ల క్లెయిమ్స్ తిరస్కరణకు దారితీస్తున్నాయని కామత్ పేర్కొన్నారు.
ఇన్సూరెన్స్ కలిగి ఉన్నాంకదా.. అన్నింటికి క్లెయిమ్ లు ప్రాసెస్ చేయబడతాయని అనుకుంటే పొరపాటు. బీమా కంపెనీలు తరచుగా క్లెయిమ్‌లను పూర్తిగా చెల్లించవు. ఒక్కోసారి క్లెయిమ్స్ ను పూర్తిగా తిరస్కరిస్తాయి. క్లెయిమ్స్ ఎందుకు తిరస్కరణకు గురవుతాయో, అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవటం చాలా ముఖ్యమని కామత్ పేర్కొన్నారు.
భీమా క్లెయిమ్‌లు ఎందుకు తిరస్కరించబడతాయో నితిన్ కామత్ అనేక కారణాలను వివరించారు ..
♦ బీమా పాలసీలు తరచుగా నిర్దిష్ట అనారోగ్యాలు లేదా ముందుగా ఉన్న పరిస్థితులను కవర్ చేయడానికిముందు నిరీక్షణ కాలాలను కలిగి ఉంటాయి. పాలసీని తీసుకొనే ముందు ఈ నిబంధనలను తప్పక పరిశీలించాలి.
♦ మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలను తీసుకోవడం ద్వారా అనారోగ్యాలకు గురైనప్పుడు కొన్ని చికిత్సలు బీమా కవరేజ్ నుంచి శాశ్వతంగా మినహాయించబడ్డాయి. బీమా తీసుకోవడానికి ముందు లేదా క్లెయిమ్ చేయడానికి ముందు ఈ మినహాయింపులను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
♦ బీమా తీసుకునే ముందు మీకుఉన్న అనారోగ్య సమస్యలపై పూర్తి సమాచారాన్ని పొందుపర్చాలి. అలా పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం వల్ల చికిత్స సమయంలో క్లెయిమ్ తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా బీమా తీసుకునేటప్పుడు అంతకుముందు మీరు ఎదుర్కొన్న ఆనారోగ్య సమస్యలను తెలియజేయాలి.
♦ బీమా సంస్థ పరిధిలోకిరాని ఆసుపత్రుల్లో చికిత్స అందించినట్లయితే క్లెయిమ్ లు తిరస్కరించే అవకాశం ఉంటుంది. చికిత్స తీసుకొనేముందు ఆ ఆస్పత్రి బీమా పొందే జాబితాలో ఉందా లేదా అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
♦ కొన్నిసార్లు బీమా సంస్థలు తదుపరి విచారణకోసం క్లెయిమ్ ఆమోదాన్ని ఆలస్యం చేస్తాయి. ఇలా చేయడం వల్ల బీమా పరిధిలో చికిత్స పొందేందుకు ఆలస్యం అవ్వడానికి కారణం అవుతుంది.
♦ బీమా తీసుకునే సమయంలో మీకు అంతకుముందు ఎదురైన అనారోగ్య సమస్యలను తెలియపర్చకుంటే క్లెయిమ్స్ సమయంలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
♦ క్లెయిమ్ తిరస్కరణల వల్ల ఒత్తిడికి గురవుతామని, అయితే, ఇలాంటి సమయంలో అవసరమైతే బీమా సలహాదారులు, న్యాయ నిపుణుల నుండి సలహాలు తీసుకోవాలని కామత్ సూచించారు. ♦ పాలసీ నిబంధనలను అర్ధం చేసుకోవడం, నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా క్లెయిమ్ తిరస్కరణ అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చునని జెరోధా సీఈవో నితిన్ కామత్ పేర్కొన్నారు.
Having insurance alone isn’t enough. Just because you have insurance doesn’t mean all your claims will be processed. Insurance companies often don’t pay claims in full or flat-out reject the claims.
It’s important to know the common reasons why claims get rejected and what you… pic.twitter.com/wdGSOzI6UF
— Nithin Kamath (@Nithin0dha) December 5, 2024