షెడ్యూల్ చెక్ : 36 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

  • Published By: chvmurthy ,Published On : February 23, 2019 / 11:25 AM IST
షెడ్యూల్ చెక్ : 36 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

Updated On : February 23, 2019 / 11:25 AM IST

హైదరాబాద్ :  వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే  హైదరాబాద్  కొచ్చువెల్లి, హైదరాబాద్  ఎర్నాకుళం మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

హైదరాబాద్ కొచ్చువెల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు  రాత్రి 8 గంటలకు మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22 మరియు 29 శనివారాల్లో బయలుదేరి , సోమవారం తెల్లవారు ఝూమున గం.3-20 కి కొచ్చువెల్లి కి చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో కొచ్చువెల్లి లో  ఉదయం గం.07-45 కి మే 6, 13, 20 మరియు 27, జూన్ 3, 10, 17, 24, మరియు జులై 1 సోమవారాల్లో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
Read Also: ఫ్యాక్టరీలో టపాసులు పేలి 10 మంది మృతి

హైదరాబాద్ ఏర్నాకుళం  మధ్య నడిచే ప్రత్యేక రైలు  హైదరాబాద్ లో మధ్యాహ్నం 12-50 గం.లకు మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19 మరియు 26  బుధవారాల్లో బయలుదేరి, తర్వాత రోజు సాయంత్రం గం.5-30 గురువారాల్లో ఏర్నాకుళం చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో ఏర్నాకుళంలో రాత్రి గం. 09.45 కు మే 2, 9, 16, 23, జూన్ 6, 13, 20 మరియు 27 గురువారాల్లో బయలుదేరి, తర్వాత రోజు రాత్రి గం.10.55 శుక్రవారాల్లో హైదరాబాద్  చేరుకుంటుంది.

Read Also: వాళ్లకు వ్యతిరేకం కాదు.. కశ్మీర్ కోసమే చేస్తున్నా: మోడీ
Read Also: ఓట్ల సర్వే చిచ్చు : యర్రావారిపాలెంలో హై టెన్షన్