శ్రీమంతుల కాలనీలే టార్గెట్ :గోల్డ్ మేన్ 47 చోరీలు

నగరంలో 47 చోరీలు
శ్రీమంతుల కాలనీలే టార్గెట్
రాచకొండ పోలీసులు పక్కా ప్లాన్
కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవైర్ నెస్ ప్రోగ్రామ్ సక్సెస్
ప్రజల సహకారంతో చిక్కిన దొంగ
రెండు కేజీల బంగారం, ఏడున్నర కేజీల వెండి స్వాధీనం
హైదరాబాద్ : వరుస చోరీలతో హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తున్న దొంగపై రాచకొడ పోలీసులు నిఘా వేశారు. ఒక్కసారి దోపిడీ జరిగితే లైఫ్ సెట్ అయిపోయేలా ఉండే శ్రీమంతుల ఇళ్లనే టార్గెట్ చేసుకున్న దోపిడీ దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఒకసారి రెండు సార్లు కాదు వరుస చోరీలకు పాల్పడు పోలీసులకే సవాల్ విసిరాడు. ఇన్ని దొంగతనాలు చేసినా దొరకటంలేదనీ ధీమాతో రెచ్చిపోయాడు సదరు దొంగ. కానీ ఎక్కడోక చోట..ఏదోక క్లూతో దొరికిపోవటం ఖాయం. ఈ క్రమంలో డబ్బున్న కాలనీలను టార్గెట్ చేసుకున్న చోరీ రాయుడు 47 చోరీ కేసుల మిస్టరీ ఛేదించారు రాచకొండ పోలీసులు.
పక్కా ప్లాన్ తో సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీసులు చేపట్టిన కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవైర్ నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా చోరీలు జరుగకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన రాచకొండ పోలీసులు ప్రజల సహాయ సహకారాలతో కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేశామని సీపీ మహేశ్ భగవత్ సోమవారం (జనవరి 28)న ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రజలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తంగెల్లముడి మం డలం చిన్న మాలపల్లికి చెందిన వేముల నటరాజ్ అనే దొంగను అదుపులోకి తీసుకున్నామని..అతని వద్దనుంచి రెండు కేజీల బంగారం, ఏడున్నర కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నటరాజ్ కొంతకాలం కిందట హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ రోడ్‌నంబర్-10లో ఉంటున్నాడు. ఆయుర్వేదిక్ వ్యాపారంతో పాటు ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు.విలాసాలకు అలవాటుపడ్డ నటరాజ్ 2005 నుంచి చోరీల బాటపట్టాడు. ఈ క్రమంలో నగరంలో బాగా డబ్బున్నవారు నివసించే కాలనీలపై కన్ను వేశాడు. దీంతో అకాశం దొరికినప్పుడల్లా దోపిడీలకు పాల్పడుతు..ఇప్పటి వరకూ 47 చోరీలు చేశాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.