మద్యం మత్తులో యాసిడ్ తాగి వ్యక్తి మృతి

హైదరాబాద్ లో మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 02:19 AM IST
మద్యం మత్తులో యాసిడ్ తాగి వ్యక్తి మృతి

Updated On : December 18, 2019 / 2:19 AM IST

హైదరాబాద్ లో మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ లో మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం… టి.లక్ష్మణ్, దేవమ్మ దంపతులు వేముకుంటలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణ్ స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. 

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం లక్ష్మణ్ మద్యం తాగి మత్తులో యాసిడ్ మింగాడు. చికిత్స కోసం వెంటనే అతడిని మల్లారెడ్డి ఆప్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మణ్ అర్ధరాత్రి మృతి చెందాడు. తండ్రి అయ్యప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.