అక్టోబర్ 10న దత్తన్న అలయ్ బలయ్

  • Published By: vamsi ,Published On : October 9, 2019 / 01:56 AM IST
అక్టోబర్ 10న దత్తన్న అలయ్ బలయ్

Updated On : October 9, 2019 / 1:56 AM IST

తెలంగాణలో పండుగల సమయంలో బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్. ముఖ్యంగా దసరా సందర్భంగా పండుగవేళ అందరూ కలవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే నేతల్లో ఒకరు బండారు దత్తాత్రేయ.. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు దత్తాత్రేయ.

రేపు(2019 అక్టోబరు 10) నక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌, బిశ్వభూషణ్‌ హరిచందన్‌, దత్తాత్రేయతో పాటు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

‘అలయ్‌ బలయ్‌’ను దత్తాత్రేయ 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఉంటున్న దత్తాత్రేయ ఆనవాయితీ ప్రకారం ఈ అలయ్ బలయ్ కార్యక్రమం హైదరాబాద్ లోనే నర్వహిస్తున్నారు.