హెచ్ఎండీఏ మైదానంలో ఆరోగ్య మేళా

  • Published By: madhu ,Published On : February 15, 2019 / 02:37 AM IST
హెచ్ఎండీఏ మైదానంలో ఆరోగ్య మేళా

Updated On : February 15, 2019 / 2:37 AM IST

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర సహకారంతో ఆరోగ్య మేళా జరుగనుంది. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం జరిగే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నెక్లెస్ రోడ్డులోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద హెచ్ఎండీఏ మైదానంలో ఉంటుందని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్  – ఇండస్ట్రీ సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ వివేక్ సెహగల్ పేర్కొన్నారు. హోం మంత్రి మహమూద్ ఆలీ మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభించనున్నారు. 

ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్యాలపై ప్రజలపై అవగాహన కల్పించడం…ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందించనున్నారు. ఉదయం 10 నుండి రాత్రి 7 గంటల వరకు మేళా కొనసాగనుంది.