ఆర్టీసీపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : కార్మికుల కోణంలో ఆలోచించాలి -జేఏసీ

ఆర్టీసీపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని..కరీంనగర్‌లో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కార్మికులను చూస్తామని..కేసీఆర్ హామీనిచ్చారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడితే..ఎన్నికలు ఆటోమెటిక్‌గా రద్దు అవుతాయన్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీఎంయూ కార్యాలయంలో జేఏసీ నేతలు 2019, అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం భేటీ అయ్యారు.
సమ్మె విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాజకీయ కోణంలో కాకుండా..కార్మికుల కోణంలో చూడాలని అశ్వత్థామ రెడ్డి కోరారు. ఆర్టీసీపైన ఎన్నో ఆరోపణలు చేశారని, కార్మికులు, యాజమాన్యం, అధికారులు మంచి వారేనంటూ వ్యాఖ్యానించారని తెలిపారు. సంఘాలు అన్నది కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉంటాయని..రాజకీయ పార్టీలు..ప్రజల సంక్షేమం కోసం ఉంటాయన్నారు. రెండేళ్లు..మూడేళ్ల కోసం సంఘాలకు ఎన్నికలు ఉంటాయని గుర్తు చేశారు.
పక్క రాష్ట్రమైన ఏపీలో సీఎం జగన్ ఆర్టీసీపై పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వంలో విలీనం విషయంలో సీఎం జగన్ సర్క్యూలర్ జారీ చేశారన్నారు. ఇటీవలే కొత్త బస్సుల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. అయితే..పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలను కూడా ఎద్దేవా చేస్తున్నారని, హైదరాబాద్ సిటీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నష్టాల్లో ఉన్నాయని..దూర ప్రాంతాల్లో వెళ్లే బస్సులు లాభాల్లో ఉన్నాయన్నారు అశ్వత్థామరెడ్డి.
Read More : కలిసి పోరాడుదాం : ఆర్టీసీ సమ్మె..ఎవరూ భయపడొద్దు – కార్మిక సంఘాలు