బాబోయ్ మంటలు : ఖాన్‌లతీఫ్‌ఖాన్ బిల్డింగ్‌లో ఫైర్ ఆక్సిడెంట్

  • Published By: madhu ,Published On : January 23, 2019 / 09:51 AM IST
బాబోయ్ మంటలు : ఖాన్‌లతీఫ్‌ఖాన్ బిల్డింగ్‌లో ఫైర్ ఆక్సిడెంట్

Updated On : January 23, 2019 / 9:51 AM IST

హైదరాబాద్ : బషీర్‌బాగ్‌..లోని ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనితో అందులో ఉన్న వారందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్‌లోని ఐదో అంతస్తులో జనవరి 23వ తేదీ బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఆ అంతస్తులో ఉన్న వారందరూ బయటకు వచ్చేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటలాతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పారు. సిబ్బందిని..ఇతరులను రక్షించారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.