నడిరోడ్డుపై కొత్త బైక్ దగ్ధం

నడిరోడ్డుపై కొత్త బైక్ దగ్ధం

Updated On : February 4, 2019 / 11:25 AM IST

కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌పై బయల్దేరిన వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. ఏ ఇతర వాహనాన్నో ఢీ కొడితే ఫైరింగ్ కాలేదు. దానిని తయారీ లోపమే ఆ ప్రమాదానికి కారణంగా మారింది. బజాజ్ పల్సర్ 220సీసీ నడుపుతున్న వ్యక్తి హిమాయత్ నగర్‌ ప్రాంతం దగ్గరకు రాగానే తన బైక్ ముందు భాగం నుంచి మంటలు రావడాన్ని గమనించాడు. 

వెంటనే బైక్‌ను పక్కకు పెట్టి తప్పుకున్నాడు. క్షణాల్లో మంటలు తీవ్రతరం అయి బైక్ అంతా కాలిపోయింది. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు కొత్తగా కొనుగోలు చేసిన వాహనమని గుర్తించారు. వైరింగ్ లోపాలు ఉండటం వల్ల ఏమైనా జరిగిందా.. బ్యాటరీ సమస్య వల్ల సంభవించిందాననే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.