గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ గెలుపు గుర్రాలు రెడీ.. 50మందితో తొలి జాబితా సిద్ధం

bjp candidates ghmc elections: గ్రేటర్ ఎన్నికల్లో 50మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేయడానికి బీజేపీ సిద్ధమైంది. ఇవాళ(నవంబర్ 18,2020) మొదటి జాబితా ప్రకటించేందుకు రెడీ అయింది. హయత్‌నగర్ నుంచి కల్లెం రవీందర్ రెడ్డి, హస్తినాపురం నుంచి నరేశ్ యాదవ్, జీడిమెట్ల- తారా చంద్రారెడ్డి, సురారం నుంచి సురేష్‌గౌడ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇటు కేపీహెచ్‌బీ- ప్రీతమ్ రెడ్డి, ఫతేనగర్ నుంచి కృష్ణగౌడ్ బరిలో ఉండనున్నారు.