తెలంగాణలో అసలు సినిమా ముందుంది

తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసలు సినిమా ముందుంది అని అన్నారు. తెలంగాణని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్న లక్ష్మణ్..

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 11:20 AM IST
తెలంగాణలో అసలు సినిమా ముందుంది

Updated On : August 29, 2019 / 11:20 AM IST

తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసలు సినిమా ముందుంది అని అన్నారు. తెలంగాణని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్న లక్ష్మణ్..

తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసలు సినిమా ముందుంది అని అన్నారు. తెలంగాణని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్న లక్ష్మణ్.. రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై లక్ష్మణ్ విమర్శలు చేశారు. నిత్యం ఫాంహౌస్ లో ఉండే వ్యక్తి బంగారు తెలంగాణ ఎలా నిర్మిస్తాడని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చిన కేసీఆర్, అధికారంలోకి రాగానే మాట తప్పారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీని సంతృప్తి పరచడానికే రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపడం లేదని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాట తప్పిన కేసీఆర్ నయా నవాబులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎందరో మహనీయుల త్యాగాలతో తెలంగాణకు విముక్తి లభించిన రోజున సంబరాలు నిర్వహించకపోవడం విచారకరం అన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడానికి ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని లక్ష్మణ్ తెలిపారు.