పాకిస్తాన్ ట్యూన్ భారత్ ఆర్మీకి అంకితం: రాజాసింగ్ పాటపై సెటైర్లు

  • Published By: vamsi ,Published On : April 15, 2019 / 02:24 AM IST
పాకిస్తాన్ ట్యూన్ భారత్ ఆర్మీకి అంకితం: రాజాసింగ్ పాటపై సెటైర్లు

తెలంగాణలో బీజేపీ తరుపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ పాకిస్తాన్ ట్యూన్‌ను కాపీ కొట్టి పాట రూపొందించాడంటూ.. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిప్ గఫూర్ ట్వీట్ చేశారు. ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే సాంగ్‌ ట్యూన్‌ను కాపీ కొట్టి పాట పాడి భారత సైన్యానికి అంకితం ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు. ఏప్రిల్ 14వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఓ పాటను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేశారు. దానిని భారత సైనికులకు అంకితం ఇచ్చారు రాజాసింగ్. రాజాసింగ్ విడుదల చేసిన సాంగ్‌ను సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే పాకిస్తాన్ దానిపై స్పందించింది.

రాజాసింగ్ విడుదల చేసిన పాట.. పాకిస్తాన్ డే సందర్భంగా తమ దేశ మీడియా వింగ్‌ విడుదల చేసిన పాటను పోలి ఉందని  వెల్లడించింది. ‘జిందాబాద్ పాకిస్తాన్’ పాటలోని ట్యూన్‌ను కాపీ కొట్టి దాన్ని ‘జిందాబాద్ హిందుస్తాన్’ అని మార్చి ప్రచారం చేసుకుంటున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంది. కాపీ కొట్టిన పాటను మళ్లీ భారత ఆర్మీకి అంకితం ఇచ్చారని పాకిస్తాన్ విమర్శించింది. పాకిస్తాన్ చెబుతున్న పాటను సాహిర్ అలీ బగ్గా రచించారు. రాజాసింగ్ పాడిన పాటను పాకిస్తానీ పాట అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.