ఇష్టం వచ్చినట్లు చంపుకుంటూ పోతే చట్టాలు ఎందుకు

  • Published By: vamsi ,Published On : December 6, 2019 / 07:39 AM IST
ఇష్టం వచ్చినట్లు చంపుకుంటూ పోతే చట్టాలు ఎందుకు

Updated On : December 6, 2019 / 7:39 AM IST

అమ్మాయిలపై దాడులకు పాల్పడిన వారికి క్యాపిటల్ పనిష్మెంట్‌ కోరారు ప్రజలు. వారు కోరుకున్నట్లే క్యాపిటల్ పనిష్‌‌మెంట్ అందింది. అయితే దేశవ్యాప్తంగా ఈ విషయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ పోలీసులకు జై కొడుతూ.. పలువురు ప్రశంసలు కురిపించగా.. దేశవ్యాప్తంగా మాత్రం కాస్త వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. ఇష్టం వచ్చినట్లు చంపుకుంటూ పోతే చట్టాలు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు కొందరు.

లేటెస్ట్‌గా పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీ మేనకా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ”హైదరాబాద్‌లో జరిగిన ఘటన చాలా భయానకమైది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. మీకు చంపాలనిపించిందని కాల్చి చంపడం కరెక్టు కాదు. నిందితులకు కోర్టుల ద్వారానే కఠిన శిక్షలు పడాలి. న్యాయ ప్రక్రియ పూర్తి కాకముందే కాల్చి చంపితే.. ఇక కోర్టులు, న్యాయ, పోలీస్ వ్యవస్థలు ఎందుకు?”. అని ప్రశ్నించారు ఎంపీ మేనకా గాంధీ.