చనిపోయి మరో 9 మందిని బతికించింది : రోడ్డు ప్రమాదంలో మరణించిన చరితారెడ్డి అవయవదానం
అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9 మందిని బతికించింది. కారు యాక్సిడెంట్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి.

అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9 మందిని బతికించింది. కారు యాక్సిడెంట్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి.
అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9 మందిని బతికించింది. కారు యాక్సిడెంట్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి. చరితా రెడ్డి చనిపోయినా.. ఆ 9 మందికి బతుకునిచ్చిన తమ బిడ్డను చూసి గర్వపడుతోంది ఆమె ఫ్యామిలీ. వారిలో తమ బిడ్డ బతికే ఉందంటూ చరితా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చరితారెడ్డి అవయవదానం
హైదరాబాద్‌కు చెందిన చరితారెడ్డి.. రెండ్రోజుల కిందట మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును.. వెనక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడంతో చరితారెడ్డి బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. ఆమెతో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ముస్కేగాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
కొందరి జీవితాల్లో వెలుగు నింపిన చరితారెడ్డి
సోమవారం ఆమె కుటుంబ సభ్యుల పర్మిషన్ తో చరితారెడ్డి అవయవాలను డాక్టర్లు దానం చేశారు. మంగళవారం స్థానిక గిఫ్ట్ లైఫ్ ఆస్పత్రిలో ఆమె అవయవదానం చేశారు. మొత్తం తొమ్మిది మందికి ఆమె అవయవాలు అమర్చి ప్రాణ దానం చేశారు. తాను చనిపోయి 9 మందిని బ్రతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అంటూ అమెరికా సమాజం ఆమెను కీర్తిస్తోంది. అంత విషాధంలోనూ ఆమె ఫ్యామిలీ అంత గొప్ప నిర్ణయం తీసుకుని.. విషాధంగా ముగియాల్సిన మరికొందరి జీవితాల్లో వెలుగు నింపారని అక్కడి వైద్యులు వారి త్యాగాన్ని కొనియాడారు.
ఎమ్ ఎస్ చదవడానికి 2015 లో అమెరికాకు
ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్ నేరేడ్ మెట్ లో చదివినా చరితారెడ్డి.. గీతం కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఎమ్ ఎస్ చదవడానికి 2015 లో ఆమె అమెరికాకు వెళ్లింది. అక్కడ ఎమ్ ఎస్ పూర్తి చేసిన చరితా రెడ్డి ఇండియాకి తిరిగి వచ్చింది. ఆ తర్వాత డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో తిరిగి ఆమె అమెరికాకు వెళ్లింది. మూడేళ్లుగా ఆమె అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందింది.