క్యాటరింగ్ కేటుగాళ్లు : రూ.4కోట్ల మోసం

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 07:28 AM IST
క్యాటరింగ్ కేటుగాళ్లు : రూ.4కోట్ల మోసం

హైదరాబాద్‌ : మోసానికి కాదేనీ అనర్హం అనుకున్నారో ఏమో ఓ కిలాడీ జంట నమ్మినవారందరికి మోసాలు వడ్డింపుల వల వేశారు. ఇంకేముంది..ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా మోసపోయినా..మరోసారి మోసపోతే పోయేదేముందిలే నమ్మకంతో పాటు డబ్బు తప్ప అనుకున్న అమాయకులు కిలాడీ జంట వలలలో ఈజీగా పడిపోయారు. దీంతో సదరు కిలాడీలు రూ.4కోట్లు నొక్కేసారు. 

క్యాటరింగ్‌ వ్యాపారంతో లాభాలు పొందొచ్చు అని అర చేతిలో లాభాల వైకుంఠం చూపించిన కొమ్మ సురేష్‌, అన్నపూర్ణలు దంపతులు నమ్మిన వారిని నట్టేట ముంచేశారు. వనస్థలిపురంలో శారదానగర్‌లో నివాసం ఉంటున్న  అన్నపూర్ణ బీడీఎల్ వర్క్ చేస్తోంది. సైడ్ బిజినెస్ గా భర్తతో కలిసి అన్నపూర్ణ ఐదేళ్ల నుండి క్యాటరింగ్ బిజినెస్ చేస్తోంది. మంచి లాభాలు వస్తున్నాయనీ…మీరేమీ కష్టపడనక్కరలేదు..కేవలం రూ.లక్ష పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ.9 వేలిస్తాం అంటు మొదట్లో బాగానే ఇచ్చారు. దీంతో  స్నేహితులు..బంధువులు, చుట్టుపక్కవవారిని నమ్మించారు. బ్యాంక్‌ వడ్డీ కంటే పది రెట్లు అధిక మొత్తం వస్తుండడంతో చాలామందిని ఇది ఆకర్షించింది. దీంతో 40మంది వద్ద వసూలు చేసిన మొత్తం రూ.4 కోట్లు అయ్యింది. 

రాను రాను వ్యాపారం సరిగా లేదని కొన్ని నెలల నుంచి ఇవ్వడం మానేశారు. దీంతో పెట్టుబడి పెట్టిన వారు అసలు ఇవ్వాలని పట్టుబట్టడంతో తమ వద్ద డబ్బులేదని చేతులెత్తేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు జనవరి 6న  పోలీసులకు కంప్లైంట్ చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.