ఏపీలో ఏమవుతుందో దేవుడికే తెలుసు : సీఎం జగన్ గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కథ ముగిసింది అని బాంబు పేల్చారు.

  • Published By: veegamteam ,Published On : October 24, 2019 / 01:09 PM IST
ఏపీలో ఏమవుతుందో దేవుడికే తెలుసు : సీఎం జగన్ గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated On : October 24, 2019 / 1:09 PM IST

హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కథ ముగిసింది అని బాంబు పేల్చారు.

హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కథ ముగిసింది అని బాంబు పేల్చారు. ఆర్టీసీ సమ్మెకి ఆర్టీసీ ముగింపే  సమాధానం అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. ఏపీలో ఆర్టీసీ విలీనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం జగన్ ను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. 

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన  సీఎం జగన్.. దీనిపై కమిటీ వేస్తున్నట్లు ఆర్డర్ మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఆ కమిటీ 3 నెలలకో, 6 నెలలకో కథ చెబుతారట అని అన్నారు. ఈ భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది సాధ్యం కాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఏపీలో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. ఐదారు నెలలు ఆగితే ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుందన్నారు.

”సీఎం జగన్ సంగతే చెబుతున్నా నేను. జగన్ అక్కడ ప్రయోగం చేశారు. ఆర్డర్ మాత్రమే ఇచ్చారు. కమిటీ వేశారు. మన్ను కూడా జరగలేదు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఆ కమిటీ కథ చెబుతుందట. 100శాతం  ఆర్టీసీ విలీనం అసాధ్యం. అసంభవం. ఈ భూగోళం ఉన్నంతవరకు అది జరిగేది కాదు. ఆర్డర్ ఇచ్చి కమిటీ వేశారు. ఏమవుతుందో దేవుడికే ఎరుక”అని కేసీఆర్ అన్నారు.

కొన్ని వారాలుగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర రాజకీయ యూనియన్ల సమ్మె అన్నారు. యూనియన్ ఎన్నికల కోసమే పనికిమాలిన సమ్మెలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ అసంబద్ధమైందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అసాధ్యం అని మరోసారి తేల్చి చెప్పారు. నాలుగేళ్ల కాలంలో 67శాతం కార్మికుల జీతాలు పెంచినా గొంతెమ్మ కోర్కెలు కోరడం దారుణం అన్నారు.

ఆర్టీసీ యూనియన్లపై సీఎం ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. యూనియన్లవి చిల్లర రాజకీయాలు అని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా అన్నారు. సమ్మె నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. యూనియన్ల పేరుతో  ఆర్టీసీకి ఉరి బిగిస్తున్నారని మండిపడ్డారు. ఆదాయం వచ్చే సమయంలో సమ్మె చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ సమ్మె చేయడు అన్నారు. కనీసం జ్ఞానం ఉన్న వాడు ఎవడూ ఇలాంటి పని చెయ్యడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో సమ్మె చేస్తారా అని నిలదీశారు. ఆర్టీసీ మునగక తప్పదని, ఎవరూ కాపాడలేరని సీఎం తేల్చి చెప్పారు.