ఈనెలాఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ ?

ఫిబ్రవరి నెల ఆఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ డిమాండ్స్ పై చిరంజీవి, నాగార్జునతో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు.

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 03:19 PM IST
ఈనెలాఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ ?

Updated On : February 4, 2020 / 3:19 PM IST

ఫిబ్రవరి నెల ఆఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ డిమాండ్స్ పై చిరంజీవి, నాగార్జునతో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు.

ఫిబ్రవరి నెల ఆఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ లో సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సినీ పరిశ్రమ డిమాండ్స్ పై చిరంజీవి, నాగార్జునతో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు. సినీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపుపై చర్చించారు. ఈనెల రెండోవారంలో మరోసారి చిరంజీవితో మంత్రి తలసాని సమావేశం కానున్నారు.

ప్రభుత్వం ముందు సినీ పరిశ్రమ డిమాండ్లు
సినీ పరిశ్రమకు సంబంధించి పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానం అనేది ప్రధానంగా డిమాండ్ గా ఉంది. ఆన్ లైన్ విధానంలో బుక్ మై షో లాంటి ప్రైవేట్ సంస్థలు లాభపడుతున్నాయి తప్ప ప్రొడ్యూసర్ కు ఎలాంటి లాభం చేకూరడం లేదని ప్రధానంగా చెబుతున్నారు. ప్రొడ్యూసర్ కు కూడా కొంతవరకు పర్సెంటేజ్ ఇవ్వాలనేది సినీ పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్.. దీనిపై ఇప్పటికే ఎఫ్ టీజీ తరపున ఒక ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తీసుకరావాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్ కు లాభం వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ ఉంది.

సినీ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపు
మరోవైపు శంషాబాద్ లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు స్థలం కేటాయింపు అనేది ప్రధాన డిమాండ్ ఉంది. జూబ్లీహిల్స్ లో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు రెండు ఎకరాల భూమి ఇవ్వాలని కోరుతున్నారు. వీటన్నింటిపై సీఎం కేసీఆర్ నుంచి హామీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 24 ఫ్రేమ్ కు సంబంధించిన కార్మికులకు స్కిల్స్ డెవలప్ మెంట్ కు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్స్ లాంటి ప్రభుత్వ పథకాలన్ని కూడా 24 ఫ్రేమ్స్ లో పని చేస్తున్న సినీ కార్మికులకు కూడా వర్తింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని సినీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ కు మెమోరండం అందజేత
ఇప్పటికే సీఎం కేసీఆర్ కు ఒక మెమోరండం ఇచ్చినట్లు సినీ పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. ఇది ప్రాథమికంగా చర్చల దశలోనే ఉంది. దీనిపై మంగళవారం చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని చర్చించారు. ఈనెల రెండోవారంలో సినీ ప్రముఖులతో చర్చలు ఉండనున్నాయి. ఈనెలాఖరులో టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో సీఎం నుంచి హామీలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ మరింత పెరగాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.  

చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని చర్చలు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో అక్కినేని నాగార్జునతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎఫ్ డీసీ ఛైర్మన్ రామ్మోహన్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేత, థియేటర్ల కొరత, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, షూటింగ్ పర్మిషన్లతో సహా లోకేషన్లలో మహిళల భద్రతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటిపై చిత్రపరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సినీ పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం
రెండు రోజుల నుంచి పలువురు సినీ పెద్దల నుంచి ప్రధాన సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వాటి పరిష్కారానికి ముందడుగు వేయబోతుంది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై చిరంజీవి, నాగార్జున సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు కొమర వెంకటేష్, హుమాయున్, సురేష్ దొరై, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.