మోటార్ వెహికల్ చట్టం అమలు చేయం – సీఎం కేసీఆర్

మోటార్ వెహికల్ చట్టంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత..రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని, ఇలాంటి చట్టం అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీనిపై సీఎం కేసీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఉర్దూ మీడియంకు సంబంధించి..ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని విద్యా శాఖ మంత్రికి సూచిస్తున్నట్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వమే కొత్త చట్టం తీసుకొస్తుందని, ఎలాంటి తొందర లేదన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా చర్యలు ఉండవని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చాక..ట్రాఫిక్ చలాన్ల బాదుడు షురూ అయ్యింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. దేశంలో
ఇప్పటివరకు ట్రాఫిక్ సిబ్బంది జారీ చేసిన చలాన్లు రికార్డు సృష్టిస్తున్నాయి. లక్షల్లో ఫైన్‌లు ఉంటుండడంతో లబోదిబోమంటున్నారు. కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయడం లేదని చెప్పగా..ఇతర రాష్ట్రాలు జరిమానాలను తగ్గిస్తున్నాయి.