పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు
టీఆర్‌ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీపీసీసీ మార్చి 20 బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

టీఆర్‌ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీపీసీసీ మార్చి 20 బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీపీసీసీ మార్చి 20 బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే పార్టీ మారినట్లుగా ధ్రువీకరించుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. టీఆర్‌ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకూ టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్ కోదండరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
‘‘మీరు కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. కార్యకర్తల అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమ, ప్రజల ఆశీర్వాదంతో గెలిచారు. పార్టీ తరపున విజయం సాధించిన మీరు పార్టీ మారుతున్నట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. మీరు మాట్లాడినట్లుగా వీడియో క్లిప్పింగులూ ఉన్నాయి. సిద్ధాంత పరమైన కారణాలు లేకుండా.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి అనే కారణంతో పార్టీ మారడం ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసినట్లవుతుంది. చట్టసభల్లో చట్టాలు చేసే మీరు.. అనైతికంగా, నీతి బాహ్యంగా పార్టీ మారడం అత్యంత దురదృష్టకరం. మీరు పార్టీ మారారా లేదా అనే అంశాలపైన మూడు రోజుల్లో తగిన వివరణ ఇవ్వని పక్షంలో మీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని నోటీసుల్లో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ వెల్లడించింది.