దేశవ్యాప్తంగా రెడ్ జోన్‌లు: ఏపీలో ఏడు జిల్లాలు.. తెలంగాణలో మూడు!

  • Published By: vamsi ,Published On : April 6, 2020 / 03:45 AM IST
దేశవ్యాప్తంగా రెడ్ జోన్‌లు: ఏపీలో ఏడు జిల్లాలు.. తెలంగాణలో మూడు!

Updated On : April 6, 2020 / 3:45 AM IST

దేశాలకు దేశాలను వణికిస్తూ.. మనదేశంపై పంజా విసిరిన కరోనా లాక్ డౌన్ వైపు మళ్లేలా చేసింది. ఇటువంటి సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా వాళ్లు తిరిగిన చోట్లపై ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ సూచనలు చేసింది. వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబ సభ్యులను, కలిసిన వాళ్లను క్వారంటైన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా 96 జిల్లాలను రెడ్ జోన్‌లుగా ప్రకటించిన కేంద్రం.. అందులో ఏపీ నుంచి ఏడు జిల్లాలను, తెలంగాణ నుంచి మూడు జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండగా.. తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను రెడ్ జోన్‌లుగా ప్రకటించింది కేంద్రం.

రెడ్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో హాట్ స్పాట్లను గుర్తించి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆ పరిధిలో అత్యవసర క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపాదికన రెడీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 
 

Also Read | సమాధులు తవ్వండి, గంటకు రూ.400 ఇస్తాం, ఖైదీలకు ప్రభుత్వం ఆఫర్