న్యూఇయర్ షాక్ : మందుబాబులకు జైలు : ఇద్దరు లేడీస్ కూడా

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 03:14 PM IST
న్యూఇయర్ షాక్ : మందుబాబులకు జైలు : ఇద్దరు లేడీస్ కూడా

హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల్లో మందుకొట్టి వాహనాలు నడిపిన వారికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 800 మందికి జైలు శిక్ష విధించింది. 3 నుంచి 16 రోజులు పాటు జైలు శిక్ష పడింది. 2వేల రూపాయల జరిమానా కూడా విధించింది. హైదరాబాద్ పరిధిలో 405 మందికి, సైబరాబాద్ పరిధిలో 379 మందికి జైలు శిక్షలు ఖరారు చేసింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వర్ష, పూర్ణిమ అనే ఇద్దరికి 16 రోజుల పాటు జైలు శిక్ష పడింది. బ్రీత్ అనలైజర్ టెస్టులో వారికి 288 పాయింట్లు వచ్చాయి. న్యూఇయర్ వేడుకల సందర్భంగా 2018 డిసెంబర్ 31 రాత్రి నుంచి 2019 జనవరి 1 ఉదయం వరకు నగరవ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వందలాది మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఇంత పెద్ద సంఖ్యలో మందుబాబులకు జైలు శిక్షలు ఖరారు చేయడం నగర చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ అని పోలీసులు చెబుతున్నారు.

గచ్చిబౌలి పరిధిలో 42మందికి
కూకట్‌పల్లి పరిధిలో 79మందికి
మాదాపూర్‌లో 147మందికి
బాలానగర్‌లో 51మందికి
మియాపూర్‌లో 56మందికి జైలు శిక్ష