నేను స్వయంగా చెప్పే వరకు నమ్మొద్దు : హెల్త్ రూమర్స్ పై స్పందించిన హీరో

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా జబ్బు పడ్డాడని, అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరిగింది. రానా కిడ్నీ ట్రాన్స్

  • Published By: veegamteam ,Published On : October 24, 2019 / 03:01 PM IST
నేను స్వయంగా చెప్పే వరకు నమ్మొద్దు : హెల్త్ రూమర్స్ పై స్పందించిన హీరో

Updated On : October 24, 2019 / 3:01 PM IST

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా జబ్బు పడ్డాడని, అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరిగింది. రానా కిడ్నీ ట్రాన్స్

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా జబ్బు పడ్డాడని, అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరిగింది. రానా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారనే న్యూస్ ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. దీంతో రానా ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రానాకి ట్వీట్లు చేశారు. మీ హెల్త్ ఎలా ఉంది అని ఆరా తీశారు.

వీటిపై రానా రియాక్ట్ అయ్యాడు. తన హెల్త్ గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించాడు. నేనే స్వయంగా చెప్పేవరకు నా గురించి వస్తున్న ఎటువంటి వార్తలను నమ్మకండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు రానా. దీంతో ఫ్యాన్స్ కొంత రిలాక్స్ అయ్యారు. వారి టెన్షన్ కొంత తగ్గింది.

ప్రస్తుతం రానా విరాటపర్వం 1992 సినిమాలో నటిస్తున్నాడు. వేణు ఉడుగుల డైరెక్టర్. సాయిపల్లవి హీరోయిన్. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి టబు రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర. మరోవైపు బాలీవుడ్ లో తెరకెక్కిన హౌస్ ఫుల్ 4 సినిమాలో రానా కీలకపాత్రలో నటించాడు. అక్షయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 25న రిలీజ్ కానుంది.