భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంపు
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచింది. పెండింగ్ లో ఉన్న భూముల క్రమద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును (జనవరి 31, 2019) వరకు పొడిగించింది.

తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచింది. పెండింగ్ లో ఉన్న భూముల క్రమద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును (జనవరి 31, 2019) వరకు పొడిగించింది.
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచింది. పెండింగ్ లో ఉన్న భూముల క్రమద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును (జనవరి 31, 2019) వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 31, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి నేటితో గడువు ముగిసింది.
రాష్ట్రంలో మరోసారి భూముల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్ విలువలతో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఒక జీవో, పేద వర్గాలకు ఉచితంగా క్రమబద్ధీకరణకు మరో జీవో ఇవ్వనుంది. దీనికోసం త్వరలో విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
2014 డిసెంబరు 31న రాష్ట్రంలో పేద వర్గాల భూములను ఉచితంగా క్రమబద్ధీకరించడానికి జీవో 58, మార్కెట్ విలువలో రాయితీతో జీవో 59 తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయా జీవోల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రభుత్వం పలు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ దఫా సమగ్రంగా రెండు వేర్వేరు జీవోలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పాత జీవోల ప్రకారం వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.