ఎన్‌కౌంటర్ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు: దిశ చెల్లి

దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరిందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా డాక్టర్ దిశ సోదరి మీడియాతో మాట్లాడారు. నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని అంతకు మించి న్యాయం జరిగిందని అన్నారు. అసలు ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు అని అన్నారు. అక్క పాప ఆత్మకు శాంతి జరిగింది. అక్యూజ్ ని తొమ్మిది రోజుల్లో ఎన్ కౌంటర్ చెయ్యడాన్ని స్వాగతించారు.
హ్యాంగ్ చేస్తాం అనుకున్నా కానీ ఇటువంటి న్యాయం ఊహించలేదని అన్నారు. నేటి తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య పోలీసులు ‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లు ప్రకటించారు. ‘దిశ’ ఘటన జరిగిన స్థలంలోనే కామాంధులు ఎన్‌కౌంటర్ అయ్యారు.
కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులపై నలుగురు నిందితులూ దాడి చేసి పారిపోతుండగా.. పోలీసులు కాల్పులు జరపారు. ఎన్ కౌంటర్ లో నిందితులు నలుగురు మరణించారు. ఈ కాల్పుల్లో నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు.