దిశ కేసు: ఎన్‌కౌంటర్‌పై విచారణ పక్షపాతం లేకుండా జరగాలి : సుప్రీంకోర్టు 

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 06:14 AM IST
దిశ కేసు: ఎన్‌కౌంటర్‌పై విచారణ పక్షపాతం లేకుండా జరగాలి : సుప్రీంకోర్టు 

Updated On : December 12, 2019 / 6:14 AM IST

సుప్రీంకోర్టులో దిశ నిందుతులపై జరిగిన ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పిటిషనర్ జీఎస్ మణిని మీరెందుకు ఈ కేసుపై పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ జరిగిన తీరు పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా కనిపిస్తోందని పిటిషన్ జీఎస్ మణి తెలిపారు.

దీనికి సమాధానంగా ఈ కేసు విషయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమగ్రంగా విచారణ జరిపిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి వివరించారు. ఎన్ కౌంటర్ పై సిట్ ఏర్పాటు చేశామని దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఈ కేసులో నిజా నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని.. ఎన్ కౌంటర్ ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో ఎలా జరిగిందో ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు నిందితులు చెప్పాలేరనీ.. దీనిపై నిష్పక్షపాత విచారణ జరగాలని.. అన్ని విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు తెలిపింది.