పేదల చెంతకే ఉచిత వైద్యం, బ‌స్తీ ద‌వాఖానాలు ప్రారంభించిన మంత్రి ఈటల

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 03:01 PM IST
పేదల చెంతకే ఉచిత వైద్యం, బ‌స్తీ ద‌వాఖానాలు ప్రారంభించిన మంత్రి ఈటల

Updated On : November 12, 2020 / 3:21 PM IST

eatala rajender BasthiDawakhana: ప్రజ‌ల‌కు ఉచితంగా మెరుగైన వైద్యం అందిచ‌డ‌మే ప్రభుత్వ ల‌క్ష్యమ‌న్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని దత్తాత్రేయ నగర్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన‌ బ‌స్తీ ద‌వాఖానాను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో క‌లిసి మంత్రి ప్రారంభించారు. బ‌స్తీ ద‌వాఖానాల్లో అన్ని ర‌కాల ప‌రీక్షల‌కు న‌మూనాలు సేక‌రిస్తార‌ని చెప్పారు. ద‌వాఖానాల్లో మందుల కొర‌త లేద‌ని స్పష్టం చేశారు.

బస్తీ ద‌వాఖానాలు పేద‌ల‌కు అందుబాటులో ఉంటాయ‌ని.. ఇవి నిత్యం తెరిచే ఉంటాయ‌ని ఈటల చెప్పారు. బ‌తుకుదెరువు కోసం వచ్చిన వారికి.. పేదలకు రెక్కాడితేగాని డొక్కాడ‌ద‌ని, ఇలాంటి వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీఎస్‌ మక్తలోని బస్తీ దవాఖానాను కూడా స్థానికి ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఈటల ప్రారంభించారు.