ఎన్నికల కోడ్: రాష్ట్రంలో కోటి రూపాయలు స్వాధీనం

  • Published By: chvmurthy ,Published On : March 16, 2019 / 02:46 PM IST
ఎన్నికల కోడ్: రాష్ట్రంలో కోటి రూపాయలు స్వాధీనం

Updated On : March 16, 2019 / 2:46 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం వేర్వేరు చోట్ల పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో  సుమారు కోటి రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మార్చి10న కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిబంధనల్లో భాగంగా … జనగాం జిల్లా పొచ్చన్నపేటలో చేపట్టిన వాహన తనిఖీల్లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.33 లక్షల 3వేల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఆర్.కె.పురం చెక్‌పోస్టు వద్ద చేపట్టిన వాహన సోదాల్లో  ఎటువంటి అనుమతి పత్రాలులేకుండా తీసుకువెళుతున్న రూ. 70 లక్షలను కూడా  పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.