ఎంబామింగ్ అంటే ఏమిటి : దిశ కేసులో మృతదేహాలు పాడవకుండా ప్రత్యేక చర్యలు
దిశ కేసులో నిందితుల మృతదేహాలను భద్రపర్చడం... పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు సవాల్‌గా మారింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వచ్చి పరిశీలించే వరకూ.. డెడ్

దిశ కేసులో నిందితుల మృతదేహాలను భద్రపర్చడం… పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు సవాల్‌గా మారింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వచ్చి పరిశీలించే వరకూ.. డెడ్
దిశ కేసులో నిందితుల మృతదేహాలను భద్రపర్చడం… పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు సవాల్‌గా మారింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వచ్చి పరిశీలించే వరకూ.. డెడ్ బాడీలను గాంధీ ఆస్పత్రిలోనే ఉంచాలన్న ఆదేశాలతో.. ఫోరెన్సిక్ నిపుణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మృతదేహాలు చెడిపోకుండా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎంబాల్మింగ్ ప్రక్రియ అంటే ఏమిటి?
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితుల మృతదేహాలపై.. హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గాంధీ ఆస్పత్రిలోనే భద్రపరచాలని ఆదేశించింది. మృతదేహాలు పాడవకుండా.. చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎన్‌కౌంటర్‌పై.. జ్యుడిషియల్ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో.. ఆ కమిటీ మృతదేహాలను పరిశీలించే అవకాశం ఉండటంతో.. వాటిని భద్రపరచాలని సుప్రీం ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు.. మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుప్రీం ఉత్తర్వులతో.. మృతదేహాల భద్రతకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మరోసారి పొడిగించింది. నాలుగు మృతదేహాలను.. గాంధీ మార్చురీలోని 7,8,9,10 బాక్సుల్లో భద్రపరిచారు ఫోరెన్సిక్ నిపుణులు. మృతదేహాలు డీ కంపోజ్ అవకుండా.. కొన్ని రసాయనాలు వాటికి ఎక్కించనున్నారు. దీనిని.. ఎంబాల్మింగ్ అంటారు.
ఎంబాల్మింగ్ ప్రక్రియలో.. మృతదేహాల్లోకి ఫార్మోల్ హెడ్, గ్లిజరిన్ లాంటి కెమికల్స్ ఎక్కిస్తారు. ఇలా చేయడం వల్ల.. డెడ్ బాడీలో ఉన్న రక్తం గడ్డ కట్టడంతో పాటు కండరాలు కూడా గట్టిపడతాయని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. తర్వాత.. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో మృతదేహాలను ఫ్రీజర్‌లో ఉంచుతారు. ఇందుకోసం.. ఫోరెన్సిక్ నిపుణులు ప్రత్యేక ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు.
మరోవైపు.. నిందితుల మృతదేహాలను తమకు అప్పగించాలని వారి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే.. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ పరిశీలించిన తర్వాతే.. మృతదేహాల అప్పగింతపై క్లారిటీ రానుంది.
* తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు మృతదేహాలను భద్రపరచాలన్న సుప్రీంకోర్టు
* మృతదేహాలను పరిశీలించనున్న జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్
* మృతదేహాలు చెడిపోకుండా భద్రపరచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
* గాంధీ ఆస్పత్రి మార్చురీలో నిందితుల మృతదేహాల కోసం ప్రత్యేక ఫ్రీజర్లు
* నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ చేయనున్న ఫోరెన్సిక్ నిపుణులు
* మృతదేహాల అప్పగింతకు నిందితుల కుటుంబసభ్యుల డిమాండ్
* జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ పరిశీలించాకే మృతదేహాల అప్పగింత