గుడ్ న్యూస్ : పీఎఫ్ వడ్డీ రేటు పెంపు

ఉద్యోగులకు శుభవార్త. PFపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. 8.55శాతంగా ఉన్న వడ్డీని.. 8.65శాతానికి పెంచారు 2018-19 సంవత్సరం నుంచి ఈ వడ్డీ అమల్లో ఉంటుంది. 6 కోట్ల మందికి లబ్దిచేకూరనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో ట్రస్టీ దగ్గర రూ.151 కోట్లు నిధులు ఉన్నాయి. పెంచిన వడ్డీ రూపంలో.. ఈ మొత్తాన్ని ఉద్యోగులకు ఇవ్వనున్నారు.
పీఎఫ్ వడ్డీ రేట్లు పెంచటం ద్వారా పాస్టాఫీసులు, కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ ఖాతాలపై ప్రభావం చూపనున్నట్లు అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సేవింగ్స్ ద్వారా వచ్చే వడ్డీ కంటే.. పెంచిన పీఎఫ్ పై వడ్డీ రేటు అధికంగా ఉండటమే. ఉద్యోగులు అందరూ కూడా పీఎఫ్ ఖాతాల్లో అధిక మొత్తంలో జమ చేయొచ్చని ఆర్థికశాఖ అంటోంది.
వచ్చే రెండు..మూడు నెలల్లో ఎన్నికల కాలం. ఈ తరుణంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 0.1 శాతం పెరగడం ఉద్యోగులకు వరంగానే చెప్పవచ్చు.
Read Also: ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్
Read Also:జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్
Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?