చిరంజీవి తొలిచిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

మెగాస్టార్‌ చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం అందింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తపై ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 06:12 AM IST
చిరంజీవి తొలిచిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

Updated On : November 16, 2019 / 6:12 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం అందింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తపై ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి స్పందించారు.

మెగాస్టార్‌ చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం అందింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడ్డారని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తపై ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి స్పందించారు. తార్నాకలో ఉంటున్న రాజుకుమార్ దగ్గరకు వెళ్లి రూ.41వేలు అందజేశారు.  

అదే విధంగా మనం సైతం తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు. మనం సైతం కుటుంబం నుంచి సాయం చేద్దామని ఆయన గ్రూపులో అభ్యర్థించగానే పలువురు నటులు, సినీ జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఆ మొత్తాన్ని కాదంబరి కిరణ్‌ స్వయంగా వెళ్లి రాజ్‌కుమార్‌కు ఇచ్చారు. స్పందించిన ప్రతి ఒక్కరికీ రాజకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

రాజకుమార్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తొలి సినిమాతోనే  5 నంది అవార్డులు అందుకొని రాజ్‌కుమార్‌ ఘనత సాధించారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా అవన్నీ సామాజిక ఇతివృత్తాలే. సామాజిక కోణంలో నిర్మించిన ఆ చిత్రాలతో ఎక్కడికో ఎదగాల్సిన ఆయనకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ముందుకెళ్లే స్థోమత లేక వెనకబడ్డారు. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం, తర్వాత కొద్ది రోజులకే సతీమణిని కూడా కోల్పోవడంతో ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వెనక్కి తిరిగి చూసుకుంటే మెగాస్టార్‌తో మొదటి సినిమా తీశానన్న సంతోషం మాత్రమే మిగిలింది. ముందుకు చూసుకుంటే భవిష్యత్తు చీకటిమయమై, బతుకు అగమ్యగోచరంగా మారింది.

ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, గీత రచయితగా, కథా రచయితగా పని చేసినా ఇప్పటికీ ఫిల్మ్‌నగర్‌లో గానీ, చిత్రపురి కాలనీలో గానీ ఆయనకు సొంతిల్లు లేదు. దీంతో అద్దె ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. పైసా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లేకపోవడంతో రెండో కొడుకు కష్టంతో బతుకు వెళ్లదీస్తున్నారు.