లోకల్ ఉద్యోగాలు: టెన్త్, ఐటీ పాసైతే చాలు

లోకల్ ఉద్యోగాలు: టెన్త్, ఐటీ పాసైతే చాలు

Updated On : August 23, 2019 / 3:17 AM IST

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు, యువతతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యల్లో జాబ్ కనెక్ట్ ఒకటి. ప్రైవేట్ రంగంలోని వివిధ కంపెనీల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం నార్త్ జోన్ పోలీసులు మెగా జాబ్ కనెక్ట్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. ప్యాట్నీ సెంటర్‌లోని స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇటెక్నాలజీలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కార్ఖానా ఇన్ స్పెక్టర్, జాబ్ మేళా ఇన్ ఛార్జ్ వరవస్తు మధుకర్ స్వామి గురువారం తెలిపారు. 

నార్త్ జోన్.. డీసీపీ కల్మేశర్ సింగెన్వార్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో ప్రవేశం, రిజిష్ట్రేషన్, ప్రొసెసింగ్ తదితరాలన్నీ పూర్తిగా ఉచితం. టెన్త్ ఫెయిల్ అయిన వారి నుంచి ఐటీ ఉత్తీర్ణులైన వారి వరకూ ప్రతి ఒక్కరికీ అనువైన ఉద్యోగాలు ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. సెక్యూరిటీ గార్డు మొదలు ఐటీ ప్రొఫెషనల్ వరకూ అన్ని రకాలైన ఉద్యోగాలకు ఇక్కడ నుంచి అవకాశం కల్పిస్తున్నారు. 

ఆయా కంపెనీల ప్రతినిధులు స్వయంగా వచ్చి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎంపిక చేసుకున్న వారికి అక్కడికక్కడే జాయినింగ్ ఆర్డర్స్ అందజేస్తారు. వీరు ఆయా సంస్థల్లో కనిష్టంగా రూ.8వేల నుంచి రూ.20వేల వరకూ వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలవారు. తమ బయోడేటాతో పాటు విద్యార్హత పత్రాల జిరాక్స్ ప్రతులు,ఫొటోలతో హాజరుకావాలని మధుకర్ స్వామి తెలిపారు.