నెంబర్ బ్లాక్ చేశారా : KTR, ఉత్తమ్ మధ్య సరదా సంభాషణ

ఎప్పుడూ సీరియస్‌గా ఉండే నాయకుల మధ్య నవ్వులు విరబూసాయి. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చుకున్న వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 06:25 AM IST
నెంబర్ బ్లాక్ చేశారా : KTR, ఉత్తమ్ మధ్య సరదా సంభాషణ

Updated On : February 23, 2019 / 6:25 AM IST

ఎప్పుడూ సీరియస్‌గా ఉండే నాయకుల మధ్య నవ్వులు విరబూసాయి. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చుకున్న వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్

ఎప్పుడూ సీరియస్‌గా ఉండే నాయకుల మధ్య నవ్వులు విరబూసాయి. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చుకున్న వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరదాగా మాట్లాడుకున్నారు. నా నెంబర్ బ్లాక్ చేసినట్టు ఉన్నావు.. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేటీఆర్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేటీఆర్.. నేను ఎవరి నెంబర్ బ్లాక్ చెయ్యను అని జవాబిచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరబూశాయి. సీఎల్పీ ఆఫీస్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
Read Also: పచ్చి అబద్దాలు చెప్పారు : అసెంబ్లీలో శ్రీధర్ బాబుపై కేసీఆర్ ఆగ్రహం

డిప్యూటి స్పీకర్‌గా పద్మారావును ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం… ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపింది. ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా తుది నిర్ణయం ప్రకటించలేదు.

దీంతో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికలో తమకు సహకరించాలంటూ శనివారం(ఫిబ్రవరి-23-2019) ఉదయం కేటీఆర్.. సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. అదే సమయంలో ఉత్తమ్ కూడా అక్కడే ఉన్నారు. కేటీఆర్‌ను చూసి ఆయన తమాషాగా మాట్లాడారు. దానికి కేటీఆర్ సైతం చమత్కారంగా జవాబివ్వడంతో నవ్వులు విరబూశాయి.
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు
Read Also: గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్