నగరంలో ప్లాస్టిక్ ఏరివేత : అతిక్రమిస్తే ఫైన్లే

  • Published By: madhu ,Published On : October 2, 2019 / 06:01 AM IST
నగరంలో ప్లాస్టిక్ ఏరివేత : అతిక్రమిస్తే ఫైన్లే

Updated On : October 2, 2019 / 6:01 AM IST

ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించకుండా..కార్యాచరణ రూపొందించింది. 50 మైక్రాన్ల కన్న తక్కువ నిడివి గల కవర్లను ఉపయోగించే వారికి జరిమానాలను విధించనున్నారు అధికారులు. నగరంలో ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలు, ప్లే గ్రౌండ్లు, రహదారుల్లో అక్టోబర్ 02వ తేదీ బుధవారం ప్లాస్టిక్ వ్యర్థాలను సిబ్బంది ఏరివేస్తున్నారు. 

స్వచ్చ భారత్ మిషన్‌లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అధికారులకు జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని అన్ని కాలనీలు, పార్కులు, ప్రధాన రహదారులు, కాలనీ సంక్షేమ సంఘాలు, ఇతర స్వచ్చంద సంస్థల సహకారంతో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాలను చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్..జోనల్, ఉప కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

సిటీలోని చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాలైన చార్మినార్, గోల్కొండ, కులీ కుతుబ్ షా సమాధులు, బిర్లా మందిర్, మక్కా మసీద్, సాలార్ జంగ్ మ్యూజియం, శిల్పారామం, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం, ప్లాగింగ్ నిర్వాహణ కార్యక్రమాలు అమలు చేయనున్నారు. ఇప్పటికే సిటీలో అక్రమ బ్యానర్లు, ఫెక్సీల ఏర్పాటుకు చెక్ పెట్టారు అధికారులు.