కొత్త గవర్నర్ కు గ్రాండ్ వెల్ కమ్
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) ఉదయం చెన్నై

తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) ఉదయం చెన్నై
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) ఉదయం చెన్నై నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి తమిళిసై చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకి వచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు కొత్త గవర్నర్ కి ఘనస్వాగతం పలికారు. అనంతరం తమిళిసై రాజ్ భవన్ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ గా ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజే సౌందరరాజన్.. సాయంత్రం తెలంగాణ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ప్రభుత్వం సౌందరరాజన్‌కు అందించింది. సెప్టెంబర్ 1న 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ.. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగా.. తెలంగాణ నూతన గవర్నర్‌గా నరసింహన్ స్థానంలో.. తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు.
తమిళిసై సౌందరరాజన్ వృత్తి రీత్యా డాక్టర్. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ జన్మస్థలం. తమిళ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. అదే సమయంలో విద్యార్థి సంఘం నాయకురాలిగానూ పనిచేశారు. ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లుగా ఎంపీగా పోటీ చేసినా.. ఒక్కసారి కూడా ఆమె విజయం సాధించలేకపోయారు.