గవర్నర్‌ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు : శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించండి

హాజీపూర్ బాధిత కుటుంబాలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు గవర్నర్ ను కోరారు. శ్రీనివాస్ రెడ్డిను ఉరి వేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని హాజీపూర్ గ్రామస్థులు గవర్నర్ ను విజ్ఞప్తి చేశారు.
హాజీపూర్ కు బ్రిడ్జి నిర్మించాలని, తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. హాజీపూర్ లో దారుణాలు జరిగి నెలలు గడిచిపోతున్నా..ఇప్పటి వరకూ నిందితుడికి శిక్ష పడకపోవటంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా..దిశ ఘటనలో ఎన్ కౌంటర్ తర్వాత తమ నిరసనలు తీవ్రం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపడుతూ..సోమవారం (డిసెంబర్ 16)న గవర్నర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
కేసు వివరాలు ఇలా..
– ఏప్రిల్ 25,2019న హాజీపూర్ గ్రామంలో విద్యార్థిన శ్రావణి అదృశ్యం..పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. దీంతో పోలీసులు శ్రావణి కోసం గాలింపు.
– ఏప్రిల్ 26న శ్రావణి చదువుకునే స్కూల్ కు వెళ్లి పోలీసులు విచారించారు.శ్రావణి బొమ్మలరామారం వెళ్లినట్లుగా గుర్తింపు. కీసర-బొమ్మల రామారం మార్గంలో పోలీసులు శ్రావణి కోసం గాలింపు చేపట్టగా..ఓ పాడుబడిన బావి వద్ద శ్రావణి స్కూల్ బ్యాగ్ పడి ఉన్నట్లుగా గుర్తించారు.
– ఏప్రిల్ 27న బావిలోకి దిగి పరిశీలించగా శ్రావణి మృతదేహాన్ని బావిలో గుర్తించారు. శ్రావణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం విచారణ వేగవంతం చేసిన పోలీసులు ఆ బావి శ్రీనివాస రెడ్డిదిగా గుర్తించారు. వెంటనే శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
– ఏప్రిల్ 29న పోలీసుల విచారణలో అనేక విషయాలు బైటపడ్డాయి. 2015లో మైసిరెడ్డిపల్లి కల్పనను కూడా శ్రీనివాసరెడ్డి అత్యాచారం చేసి చంపేసినట్లుగా గుర్తించారు. శ్రావణిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు.
– ఏప్రిల్ 30న శ్రీనివాస రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కల్పన అస్థికలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాలికల్ని పొట్టన పెట్టుకున్న శ్రీనివాస రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు అతని ఇంటికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో బాలిక మిస్సింగ్ కేసు విషయంలో విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసును భువనగిరి పోలీసులకు అప్పగించారు.
– మే 1 2019న శ్రీనివాస రెడ్డిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి..14 రోజులు జ్యుడిషియల్ కష్టడికి కోర్టును కోరారు.
– మే 8న శ్రీనివాస రెడ్డికి 5 రోజులు పోలీసు కష్టడీకి నల్గొండ జిల్లా కోర్టు విధించింది. అనంతరం మూడు రోజుల పాటు విచారించిన శ్రీనివాసరెడ్డిన వరంగల్ జైలుకు తరలించారు.
– జులై 31న ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. మూడు చార్జ్ షీట్లు ధాఖలు చేసారు.
– అక్టోబర్ 14న ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభించారు.
– అక్టోబర్ 29న ఈ కేసు విచారణకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హాజరయ్యారు.