టిక్ టాక్ ప్రేమ… ప్రియుడి వేధింపులే శ్రావణి సూసైడ్ కు కారణమా ? ఆత్మహత్యకు ముందు దేవరాజు గురించి ఏం చెప్పింది?

  • Published By: murthy ,Published On : September 9, 2020 / 12:48 PM IST
టిక్ టాక్ ప్రేమ… ప్రియుడి వేధింపులే శ్రావణి సూసైడ్ కు కారణమా ? ఆత్మహత్యకు ముందు దేవరాజు గురించి ఏం చెప్పింది?

Updated On : September 9, 2020 / 4:04 PM IST

మౌనరాగం నటి శ్రావణి: టిక్ టాక్ పరిచయం ఓ సీరియల్ నటి ప్రాణాలు తీసింది. ముందు మంచిగానే పరిచయం అయిన వ్యక్తి తర్వాత వేధింపులకు గురి చేయటంతో బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. తనకెవరూ లేరంటూ మాయమాటలు చెప్పిపరిచయం పెంచుకున్న వ్యక్తి చివరకు బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. అతడి వేధింపులు తాళలేక శ్రావణి ప్రాణాలు విడిచింది.

కాకినాడ, గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి @ సన్నీతో కొన్నేళ్ళ క్రితం టిక్ టాక్ ద్వారా శ్రావణికి పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం క్రమేపి వారిద్దరూ మరింత సన్నిహితంగా ఉండేలా పెరిగింది. వారిద్దరి మధ్య ఏమైందో ఏమో కానీ …..ఈ ఏడాది జూన్ లో దేవరాజు పై శ్రావణి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.



ఆమె ఫిర్యాదు మేరకు దేవరాజ్ ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. అతను జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత…. ఇటీవల శ్రావణి, దేవరాజు ఇద్దరూ తిరిగి కలుస్తున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు.. ఈ విషయమై కుటుంబ సభ్యులు శ్రావణి తో మాట్లాడారు..శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి వుంది..నిందితుడు దేవరాజు అదుపులోకి తీసుకొని విచారిస్తామని ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపారు.



కాకినాడ లో దేవరాజు ఉన్నట్లు గుర్తించామని, అక్కడికి ఓ పోలీసు బృందాన్ని పంపించామని పోలీసులు తెలిపారు. తనకెవ్వరూ లేరని పరిచయం చేసుకున్న దేవరాజుకి తల్లి వుంది. వారిద్దరూ హైదరాబాద్ లోనే నివసిస్తూ ఉండేవారు. ఈవిషయం దాచిపెట్టి దేవరాజ్ శ్రావణితో పరిచయం పెంచుకున్నాడు.
https://10tv.in/11-year-old-boy-murders-9-year-old-girl/
టిక్ టాక్ ద్వారా పరిచయం అయిన దేవరాజుతో కాల క్రమంలో శ్రావణి మరింత సన్నిహితంగా మెలిగింది. ఆసమయంలో ఆమెకు తెలియకుండా కొన్ని. తెలిసి కొన్ని వీడియోలు ఫోటోలు తీశాడు. ఇటీవల ఆ ఫోటోలు వీడియోలు చూపించి ఆమెను వేధింపులకు గురి చెయ్యటం మొదలెట్టటంతోనేశ్రావణి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో జూన్ లో ఫిర్యాదుచేసినట్లు ప్రాధమిక సమాచారం.



దేవరాజ్ వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లితండ్రులు ఈరోజు ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 306 కింద దేవరాజ్ పై కేసు నమోదు చేసారు.దేవరాజ్ ప్రస్తుతం కాకినాడలో ఉన్నట్లు గుర్తించారు. దేవరాజ్ ను అదుపులోకి తీసుకోటానికి ప్రత్యేక పోలీసు బృందాన్నికాకినాడకు పంపించారు.

కాగా…..ఈ కేసులో పను అనుమానాలు తెలెత్తుతున్నాయి. శ్రావణికి తెలియకుండ తీసిన వీడియోలు…ఆమెతో సన్నిహితంగా ఉన్నఫోటోలు బయట పెడతానని తిరిగి దేవరాజ్ బెదిరించటం మొదలెట్టడంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లితండ్రులు చెపుతున్నారు.



ఆ వీడియోలు బయట పెట్టకుండా ఉండాలంటే తనతో రెగ్యులర్ గా కలవాలని అతను బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఈవేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏమైనా దేవరాజ్ అరెస్టై పోలీసు విచారణ ద్వారానే అవన్నీ నివృత్తి అవుతాయి.