ఫస్ట్ టైమ్ : కొత్త రోల్ లో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్

టీఆర్‌ఎస్‌ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావు.. కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. గతంలో ఇరిగేషన్ మినిస్టర్‌గా సేవలందించిన ఆయన.. తొలిసారి ఆర్థికమంత్రిగా విధులు

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 02:03 AM IST
ఫస్ట్ టైమ్ : కొత్త రోల్ లో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్

Updated On : September 9, 2019 / 2:03 AM IST

టీఆర్‌ఎస్‌ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావు.. కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. గతంలో ఇరిగేషన్ మినిస్టర్‌గా సేవలందించిన ఆయన.. తొలిసారి ఆర్థికమంత్రిగా విధులు

టీఆర్‌ఎస్‌ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావు.. కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. గతంలో ఇరిగేషన్ మినిస్టర్‌గా సేవలందించిన ఆయన.. తొలిసారి ఆర్థికమంత్రిగా విధులు నిర్వహించబోతున్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన మరునాడే…అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వంలో క్రీడలు, యువజన సర్వీసులు, 2014లో ఏర్పడిన కేసీఆర్ సర్కార్‌లో కీలకమైన సాగునీటి పారుదల శాఖలను నిర్వహించారు. తొలిసారి ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వహించబోతున్నారు. ఆర్థికమంత్రిగా ఆదివారం(సెప్టెంబర్ 8,2019) ప్రమాణం చేసిన హరీశ్ రావు… సోమవారం(సెప్టెంబర్ 9,2019) బడ్జెట్ ప్రసంగం చేయబోతున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ఒక రోజు ముందే మంత్రిగా ప్రమాణం చేయడం… ఆ తర్వాత ఆర్థికశాఖ అప్పగించడంతో… మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు హరీశ్‌రావు.

2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 2018 వరకు ఆయనే బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చారు. 2018 డిసెంబర్‌లో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికశాఖను సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రభుత్వం తరపున ఆయనే స్వయంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో… బడ్జెట్‌కు కేవలం ఒక రోజు ముందే హరీశ్ రావు ఆర్థిక శాఖ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రెండో ఆర్థికమంత్రిగా రికార్డ్‌ సొంత చేసుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు.. ఎలా పనిచేశారో అందరికీ తెలుసు. రాష్ట్రానికి అతిముఖ్యమైన నీళ్ల విషయంలో ఆయన చూపిన పట్టుదల, తెగింపు కూడా రాష్ట్ర ప్రజలంతా చూశారు. మొత్తంగా ఏ పని అప్పగించినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారని ఆయనకు పేరు. అయితే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను హరీశ్‌రావు అయితే చక్కగా నడిపించగలరని.. ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడకుండా చూడగలరన్న నమ్మకంతో కేసీఆర్.. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను ఇచ్చారని అటు పార్టీలో.. ఇటు ప్రజల్లో టాక్ వినిపిస్తోంది. మరి హరీశ్‌రావు అందరి ఆశలను నిలబెడతారా? ఆర్థిక మంత్రిగా సక్సెస్‌ అవుతారా అన్నది చూడాలి.