వణికిస్తున్న విషజ్వరాలు : హైదరాబాద్ లో హెల్త్ ఎమర్జెన్సీ

హైదరాబాద్ నగరాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, చికున్ గన్యా, డయేరియా, డిప్తీరియా విజృంభించాయి. వైరల్ జ్వరాలతో నగరవాసి

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 02:21 AM IST
వణికిస్తున్న విషజ్వరాలు : హైదరాబాద్ లో హెల్త్ ఎమర్జెన్సీ

Updated On : September 5, 2019 / 2:21 AM IST

హైదరాబాద్ నగరాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, చికున్ గన్యా, డయేరియా, డిప్తీరియా విజృంభించాయి. వైరల్ జ్వరాలతో నగరవాసి

హైదరాబాద్ నగరాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. వైరల్ జ్వరాలతో నగరవాసి విలవిలలాడిపోడుతున్నాడు. డెంగీ, మలేరియా, చికున్ గన్యా, డయేరియా, డిప్తీరియా విజృంభించాయి. ఓవైపు డెంగీ దోమ ప్రాణాలు  తీస్తుంటే… మరోవైపు ఏజెన్సీ దోమ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు రోజుల వ్యవధిలో డెంగీతో ఐదుగురు మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉస్మానియా, గాంధీ,  నీలోఫర్ ఫీవర్ ఆసుపత్రులకు బాధితులు క్యూ కట్టారు. ఒక్కో ఆసుపత్రిలో 40 నుంచి 50 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వైద్య సిబ్బంది సెలవులు  కూడా రద్దు చేసింది. డాక్టర్లు అందుబాటులో ఉండాలని చెప్పింది. సీజనల్ వ్యాధుల నియంత్రణపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రులు సమీక్షించారు. స్కూల్స్ లో రోజూ ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. 

2019లో ఇప్పటివరకు డెంగీ కారణంగా 50 మంది చనిపోయారు. వారిలో 40 మందికిపైగా గ్రేటర్ జిల్లాల వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ లో విషజ్వరాల కేసులు నమోదు  అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. సాధారణ రోజులతో పోలీస్తే ప్రస్తుతం ఓపీ సంఖ్య రెట్టింపు అయ్యింది. ఉస్మానియాలో ఓపీ 2 వేల నుంచి 3వేల కు చేరింది.  గాంధీలో 3వేల నుంచి 5 వేలకు.. ఫీవర్ లో 1200 నుంచి 2500.. నిలోఫర్ లో 1500 నుంచి 2500కి చేరింది. సెలవు రోజుల్లోనూ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు నివారణ  చర్యలు చేపట్టారు. స్కూల్స్ లో దోమల నివారణ స్ర్పే చెయ్యాలన్నారు. కాలనీలు, రోడ్లపై చెత్త లేకుండా ఏ రోజుకా రోజే తొలగించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రులు కాదు ప్రైవేటు ఆసుపత్రులూ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. డెంగీ కారణంగా 50మంది చనిపోవడం తెలంగాణ చరిత్రలో గతంలో లేదంటున్నారు. 2017లో మరణాలు సంభవించలేదు. 2018లో ఐదుగురు చనిపోయారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐదేళ్ల వయసు చిన్నారులు మృత్యువాత పడటంపైనా ఆందోళన వ్యక్తం అవుతోంది. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రెండ్రోజులుగా వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ సుదీర్ఘ సమీక్షల్లో మునిగిపోయారు. ఫీవర్‌ ఆసుపత్రి సందర్శించారు. డెంగీపై ఏం చేయాలన్న దానిపై వైద్యాధికారులతో చర్చలు జరిపారు. బోధనాసుపత్రులు, ఫీవర్‌ ఆసుపత్రి, ఐపీఎం కేంద్రాల్లో ప్రజలకు ఉచిత డెంగీ పరీక్షలు నిర్వహిస్తుండగా, ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లలోనూ ఉచితంగా పరీక్షలు చేసేందుకు కొన్ని ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

డెంగీ జ్వరాలు రాకుండా ఉచిత హోమియో మందు సరఫరా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆయుష్‌ విభాగం ద్వారా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని హోమియో కాలేజీలో, ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్ల దగ్గర ఉచిత హోమియో మందులు సరఫరా చేయనున్నారు. 3 లక్షల డోసుల డెంగీ నివారణ మందు సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డెంగీ నివారణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. సీజనల్ వ్యాధుల విజృంభణతో దోమ తెరలకు డిమాండ్ ఏర్పడింది. అలాగే బొప్పాయి, కివీ పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి.