వెంకటేష్ మంచి మనసు: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి పరామర్శ

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని పరామర్శించారు. నేనున్నా అని భరోసా ఇచ్చారు. ఎల్బీనగర్

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 04:57 AM IST
వెంకటేష్ మంచి మనసు: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి పరామర్శ

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని పరామర్శించారు. నేనున్నా అని భరోసా ఇచ్చారు. ఎల్బీనగర్

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని పరామర్శించారు. నేనున్నా అని భరోసా ఇచ్చారు. ఎల్బీనగర్ సమీపంలోని  మన్సూరాబాద్ శైలాజపురి కాలనీలో నివాసం ఉండే సురేష్‌.. కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. విక్టరీ వెంకటేష్‌కి.. సురేష్ వీరాభిమాని. ఎల్బీ న‌గ‌ర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్‌.

తన అభిమాని అనారోగ్యం గురించి తెలుసుకున్న వెంకటేష్‌ ఆవేదన చెందారు. అసలు ఆగలేకపోయారు. వెంటనే సురేష్ ఇంటికి వెళ్లారు. అతడిని ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భయపడొద్దు.. ఏమీ కాదని భరోసా ఇచ్చారు. అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటాన‌ని హామీ కూడా ఇచ్చారు. సురేష్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వెంకటేష్ ఆకాంక్షించారు. తాను అభిమానించే హీరోనే స్వయంగా తన ఇంటికి వచ్చి ధైర్యం చెప్పడంతో సురేష్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. సురేష్ స్వస్థలం నల్లగొండ జిల్లా రాజపేట మండలం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మన్సురాబాద్‌లో అతడి కుటుంబం నివాసం ఉంటోంది.

సురేష్ ని.. వెంకీ పరామర్శించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వెంకీ చూపించిన మంచితనానికి, మంచి మనసుకి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. రియల్ హీరో అని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. వెంకటేష్.. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఇందులో నాగ‌చైత‌న్య మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.