ఎండలు మండుతున్నాయి : జగిత్యాలలో @ 40.3 డిగ్రీలు

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 12:54 AM IST
ఎండలు మండుతున్నాయి : జగిత్యాలలో @ 40.3 డిగ్రీలు

Updated On : March 16, 2019 / 12:54 AM IST

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. రెండు నుండి మూడు డిగ్రీల మేర గరిష్ట టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 15వ తేదీ శుక్రవారం జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబీ, పెద్దపల్లి జిల్లా రామగుండం, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలలో 40.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ధర్మపురం మండలం జైన, సూర్యాపేట జిల్లా దొండపాడు, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లలో 40.1 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎండపల్లి రాజారాంపల్లిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

రాష్ట్రంలో మార్చి 16వ తేదీ శనివారం, మార్చి 17వ తేదీ ఆదివారాల్లో కూడా ఎండలు అధికమయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెండు నుండి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.