బెట్టింగ్ రాయుళ్లపై గురి: దొరికితే వదిలిపెట్టం

  • Published By: vamsi ,Published On : April 7, 2019 / 02:38 AM IST
బెట్టింగ్ రాయుళ్లపై గురి: దొరికితే వదిలిపెట్టం

Updated On : April 7, 2019 / 2:38 AM IST

ఓవైపు ఎన్నికలు.. మరోవైపు ఐపీఎల్.. బెట్టింగ్ బంగారు రాజులకు ఇక సరైన సీజన్.. బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్ ముఠాలు భారీగా డబ్బును చేతులు మార్చనున్నట్లు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద జోరుగా పందెలు కాసే అవకాశం ఉండడంతో బెట్టింగ్ ధరను నిర్ణయించేందుకు బెట్టింగ్ ముఠాలు గెలుపుఓటములపై విశ్లేషిస్తున్నారు. అభ్యర్థి ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? రౌండ్‌ల వారీగా లీడ్ ఎవరు ఉంటా ఇలా అన్ని అంశాల్లో బెట్టింగ్‌లను నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. ఈ సమయంలో బెట్టింగ్ దందాపై పూర్తి నిఘా పెట్టామని, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌లకు చెందిన అధికారులు వెల్లడించారు. మాచారం వస్తే ఎవరిని వదిలి పెట్టమని, క్రికెట్.. ఎన్నికల బెట్టింగ్‌లపై సమాచారం ఉంటే డయల్ 100, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.