సాప్ట్ వేర్ ఇంజనీర్స్ సైడ్ బిజినెస్..డ్రగ్స్ బల్క్ గా కొని భారీ లాభాలకు అమ్మకాలు

Hyderabad Three software engineers for selling drugs : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే రెండు చేతులా సంపాదనే. చక్కటి జీతాలు తెచ్చుకుంటూ కూడా అవి చాలవన్నట్లుగా డ్రగ్స్ అమ్మకాలు చేస్తే సైడ్ బిజినెస్ లు కూడా చేస్తున్నారు. తక్కువ ధరలకే డ్రగ్స్ కొని భారీ లాభాలకు అమ్ముతున్నారు. ఓపక్క ఉద్యోగం..మరోపక్క ఈ డ్రగ్స్ వ్యాపారంతో దండిగా సంపాదించేస్తున్నారు. డ్రగ్స్ బిజినెస్ లో భారీ లాభాలు రావటంతో ఉద్యోగం వదులుకోవాటానికి కూడా సిద్ధపడుతున్నారు ఈజీ మనీకి అలవాటుపడిన కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.
హైదరాబాద్ పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్ నగర్ ఐటీకి ఆలవాలం. ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ప్రతీరోజు డ్యూటీలు చేస్తుంటారు. ఈ క్రమంలో మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన 27 ఏళ్ల శివసేనారెడ్డి, వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన 27 ఏళ్ల మేకసాయి విపిన్, ఘట్‌కేసర్ పోచారంలోని సింగపూర్ టౌన్‌షిప్‌కు చెందిన హర్షవర్ధన్ లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.
వీళ్లు ముగ్గురు ఈజీగా మనీ సంపాదించటంపై దృష్టిపెట్టారు. అలా ఓ వైపు ఉద్యోగాలు చేసుకుంటూ మరో వైపు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. వీళ్లు గోవా, విశాఖపట్టణం నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లో అమ్ముతున్నారు. బల్క్ గా డ్రగ్స్ తెప్పించుకుని భారీ లాభాలకు అమ్ముకుంటున్నారు. ఈజీగా మనీ వచ్చి పడుతుండటంతో యదేచ్ఛగా వారి డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
కానీ పోలీసులకు వాసన తెలిసింది. పక్కా సమాచారంతో తార్నాక వద్ద కాపుకాశారు. తాము తెప్పించుకున్న డ్రగ్స్ పట్టుకుని బైక్‌పై వస్తున్న శివసేనారెడ్డి, సాయి విపిన్‌లను ఆపి తనిఖీ చేయగా..వారి వద్ద డ్రగ్స్ దొరికాయి. 150 మైక్రోగ్రాములు 56 ఎల్ఎస్‌డీ బ్లాట్స్, 12 గ్రాముల చొప్పున రెండు హషిష్ ఆయిల్ సీసాలు లభ్యమయ్యాయి. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని సెల్ లో వేశారు.
వీరిని విచారించగా..ఎల్ఎస్‌డీ బ్లాట్స్‌ను గోవా, విశాఖపట్టణం నుంచి తెప్పిస్తున్నామనీ..ఒక్కో దానిని రూ. 2 వేలు ఇచ్చి తెప్పిస్తున్నట్టు శివసేనారెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. హర్షవర్ధన్ నుంచి హషిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్టు సాయి విపిన్ ఒప్పుకున్నాడు. ఒక్కో సీసాను రూ. 2వేల 500కు కొని వాటిని తిరిగి రూ. 4 వేలకు అమ్ముతున్నట్లుగా చెప్పాడు.
ఈ బిజినెస్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారనీ ప్రశ్నించగా ఎవ్వరూ లేరనీ మేమే చేస్తున్నామని సాయి విపిన్ చెప్పాడు. దానికి పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. సింగపూర్ టౌన్‌షిప్‌లోని హర్షవర్ధన్ కూడా ఉన్నాడని చెప్పాడు. దీంతో హర్షవర్థన్ ఫ్లాట్‌లో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీ చేయగా..హషిష్ ఆయిల్ (గంజాయి ఆకులతో తయారు చేసిన ఆయిల్ ) సీసాలు పట్టుబడ్డాయి.
విశాఖపట్టణానికి చెందిన కార్తీక్ నుంచి కిలో ఆయిల్‌ను లక్ష రూపాయలకు కొన్నామని హర్షవర్ధన్ తెలిపాడు. అలా తెప్పించిన ఆయిల్ ను 12 గ్రాముల ఆయిల్‌ను రూ. 2,500కు అమ్ముతున్నామని చెప్పాడు. పరారీలో ఉన్న కార్తీక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.