అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి
అమెరికాలో హైదరాబాద్ కు చెందిన తెలుగు మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో గజం వనిత(38) అనే మహిళ సూసైడ్ చేసుకున్నట్లుగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది.

అమెరికాలో హైదరాబాద్ కు చెందిన తెలుగు మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో గజం వనిత(38) అనే మహిళ సూసైడ్ చేసుకున్నట్లుగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది.
అమెరికాలో హైదరాబాద్ కు చెందిన తెలుగు మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో గజం వనిత(38) అనే మహిళ సూసైడ్ చేసుకున్నట్లుగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది. హైదరాబాద్‌లోని నాగోల్ సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులు మాత్రం.. అత్తింటి వేధింపుల కారణంగానే వనిత చనిపోయిందని వాదిస్తున్నారు. అంతకుముందు కూడా వనిత భర్త వేధింపులు కారణంగా హైదరాబాద్ లో తల్లిదండ్రుల వద్దే ఉండేది.
అయితే జులై నెలలో నార్త్ కరోలినాలోని భర్త వద్దకు తిరిగి వెళ్లిన వనిత 2 నెలలనుంచి తల్లిదండ్రులతో కాంటాక్ట్‌లో లేదు. ఈ క్రమంలోనే ఆదివారం(06 అక్టోబర్ 2019) వనిత తల్లిదండ్రులకు ఆమె సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం అందించారు. అయితే అత్తింటి వేధింపులు భరించలేకే వనిత మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖంపై దిండుతో అదిమి చంపినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో నాగోల్ లోని వనిత పుట్టింట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే వనిత భర్త రాచకొండ శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు కరోలినా పోలీసులు. వనితది హత్య లేకుంటే ఆత్మహత్య అనే విషయంపై క్లారిటీ రావలసి ఉంది.