హైదరాబాద్ సైంటిస్టుల ఘనత : చేపల నుంచి కృతిమ చర్మం, అవయవాలు

ఐఐటీ హైదరాబాద్ కి చెందిన సైంటిస్టులు అద్భుతం చేశారు. చేప వ్యర్థాలు, చర్మం నుంచి స్టెమ్ సెల్స్(కణాలు), కొలాజెన్ తయారు చేశారు. స్టెమ్స్ సెల్స్ ద్వారా కృతిమ చర్మం,

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 09:59 AM IST
హైదరాబాద్ సైంటిస్టుల ఘనత : చేపల నుంచి కృతిమ చర్మం, అవయవాలు

Updated On : May 28, 2020 / 3:44 PM IST

ఐఐటీ హైదరాబాద్ కి చెందిన సైంటిస్టులు అద్భుతం చేశారు. చేప వ్యర్థాలు, చర్మం నుంచి స్టెమ్ సెల్స్(కణాలు), కొలాజెన్ తయారు చేశారు. స్టెమ్స్ సెల్స్ ద్వారా కృతిమ చర్మం,

ఐఐటీ హైదరాబాద్ కి చెందిన సైంటిస్టులు అద్భుతం చేశారు. చేప వ్యర్థాలు, చర్మం నుంచి స్టెమ్ సెల్స్(కణాలు), కొలాజెన్ తయారు చేశారు. కృతిమ చర్మం, అవయవాల తయారీకి స్టెమ్స్ సెల్స్ ఉపయోగపడతాయి. స్టెమ్ సెల్స్ రీసెర్చ్ చాలా కాలంగా కొనసాగుతోంది. ఎందరో సైంటిస్టులు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. శరీరంలో పాడైన కణాలను, అవయవాలను రీప్లేస్ చేయడానికి స్టెమ్ సెల్స్, కొలాజెన్ ఉపయోగపడతాయి. ఐఐటీ హైదరాబాద్ కి చెందిన ముగ్గురు సైంటిస్టుల బృందం స్టెమ్ సెల్స్ రీసెర్చ్ లో గణనీయమైన పురోగతి సాధించింది. సముద్ర జీవుల వ్యర్థాల నుంచి కణాలు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. స్టెమ్ సెల్స్ అభివృద్ధికి పనికొచ్చే కాన్ సంట్రేటేడ్ కొలాజెన్ ని డెవలప్ చేశారు.

మనిషి శరీర నిర్మాణంలో కీలకమైన కొలాజెన్​ అనే ప్రొటీన్​ ను తయారు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అవయవదాతల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కృత్రిమ అవయవాల అవసరం పెరిగిపోతోంది. ఫ్రెష్‌ పద్ధతి ద్వారా కణాలు, కొలాజెన్ సాయంతో గుండె కవాటాలు తయారు చేయొచ్చని పరిశోధనలో తేలింది.

ప్రస్తుతం కొలాజెన్ ను ఆవుల చర్మం నుంచి తీస్తున్నారు. అయితే ఆవులకు మ్యాడ్ కౌ అనే వ్యాధి సోకింది. దీంతో ఆవు చర్మం అంత సేఫ్ కాదని తేలింది. ఐఐటీ హైదరాబాద్ సైంటిస్టుల బృందంలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ మనో గోవిందరాజ్, డాక్టర్ సుబా నారాయణ్ రత్, ఉదయ్ కిరణ్ రూపవత్ పరిశోధనలు జరుపుతున్నారు. చేపల చర్మం నుంచి కొలాజెన్ ను ఉత్పత్తి చేయొచ్చని చెప్పారు. ఇది మేజర్ డెవలప్ మెంట్ అని వెల్లడించారు. మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని, ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇది సక్సెస్ అయితే.. కృతిమ శరీరం, అవయవాలు తయారు చేయడం సులభం అవుతుందని చెప్పారు. అలాగే స్టెమ్ సెల్స్(కణాలు) ద్వారా పాడైన గుండె, లివర్, కిడ్నీలు ఏ విధంగా బాగుచేయొచ్చు అనే దానిపై రీసెర్చ్ జరుగుతోందన్నారు.

Also Read : ఆగస్టు 31 లాస్ట్ : Xiaomi Mi A3 స్పెషల్ సేల్.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు