బ్లాక్‌లో IPL టికెట్లు

ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు… వారినుంచి 16 టికెట్లు, 38వేల నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ మెట్రో రైల్వేస్టేషన్లలో ఐపీఎల్ టికెట్స్ బుకింగ్ క్లర్కులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అసెంబ్లీ మెట్రో స్టేషన్ బయట ఐపీఎల్ టికెట్లను విక్రయిస్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు.
తుకారం గేట్‌కు చెందిన ఆర్. వరుణ్ కుమార్, రంజిత్ కుమార్‌లు అసెంబ్లీ మెట్రో స్టేషన్‌లోని ఈవెంట్స్ నౌ సంస్థ కౌంటర్‌లో బుకింగ్ క్లర్క్‌లుగా పనిచేస్తున్నారు. కౌంటర్ వద్ద రాహుల్ అనే యువకుడు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది.