కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గం, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసేది ఎవరో తేలిపోయింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టి.జీవన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్, మాజీ మంత్రి శశిధర్ రెడ్డిలు ఈ రేసులో ఉన్నారు. చివరి నిమిషంలో వీరిద్దరూ కాకుండా గూడూరు వైపు అధిష్టానం మొగ్గినట్లు టాక్. ఏమైనా అనూహ్య పరిణామాలు సంభవించకపోతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డి ఫిబ్రవరి 28వ తేదీ గురువారం నామినేషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. రెండు స్థానాల్లో అభ్యర్థులను గురువారం అధికారికంగా ప్రకటించనుంది.