ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవండి : సీఎం కేసీఆర్ కు జేపీ లేఖ

ఆర్టీసీ సమ్మెపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. సమస్య పరిష్కరానికి సీఎం కేసీఆర్ చొరవ చూపాలని లేఖలో కోరారు.

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 02:26 PM IST
ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవండి : సీఎం కేసీఆర్ కు జేపీ లేఖ

Updated On : November 19, 2019 / 2:26 PM IST

ఆర్టీసీ సమ్మెపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. సమస్య పరిష్కరానికి సీఎం కేసీఆర్ చొరవ చూపాలని లేఖలో కోరారు.

ఆర్టీసీ సమ్మెపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. సమస్య పరిష్కరానికి సీఎం కేసీఆర్ చొరవ చూపాలని లేఖలో కోరారు. విలీనం విషయంలో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గడంతో… వారి మిగతా డిమాండ్ల అంశాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలించాలని.. కార్మికులను చర్చలకు పిలవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలన్నారు. 

ఆర్టీసీని ప్రైవేటు రంగంతో పోటీ పడేలా చేయాలనే కేసీఆర్ నిర్ణయాన్ని జేపీ సమర్థించారు. ఆర్టీసీ విలీనం విషయంలో కార్మికులు వెనక్కి తగ్గడం కేసీఆర్ వాదనలకు లభించిన విజయమని అన్నారు. ఇందుకు కార్మికులను కూడా అభినందించాలన్నారు. అయితే వారి మిగతా సమస్యల పరిష్కారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ సమ్మె విష‌యంలో మొదటి నుంచి ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరికాదనే వాదనను జేపీ వినిపించారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో కార్మికులు జోక్యం చేసుకోవద్దని ఆయన సూచించారు.

కాగా, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై మంగళవారం(నవంబర్ 19,219) విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణ రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతుందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానిదేనన్న హైకోర్టు.. కేబినెట్ నిర్ణయం తప్పు ఎలా అవుతుందో చెప్పాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. 5వేల 100 రూట్లను ప్రైవేటీకరించడం చట్ట విరుద్ధం అని.. సెక్షన్ 99, 100, 102, 104లను పిటిషనర్ ప్రస్తావించగా.. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు ఇప్పుడు చెబుతున్న సెక్షన్లకు పొంతన లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రైవేటీకరణ ఎలా చట్ట విరుద్ధమో తెలపాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఆర్టీసీకి నష్టం జరగదని సీఎం చెప్పినట్లు కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది తెలియజేయగా.. సీఎం ఏం చెప్పారన్నది న్యాయస్థానానికి ముఖ్యం కాదన్న హైకోర్టు.. కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా? చట్ట విరుద్ధమా? అన్నదే ముఖ్యమని తెలిపింది. తదుపరి విచారణ బుధవారానికి(నవంబర్ 20,2019) వాయిదా వేసింది.